Friday, September 18, 2026 02:53 AM
Friday, September 18, 2026 02:53 AM

బీఆర్‌ఎస్‌ లో కవిత చిచ్చు.. అక్కతో టచ్ లో మాజీ ఎమ్మెల్యేలు..!

తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి హీట్ పెంచారు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఒక ప్రైవేట్ చిట్ చాట్‌ లో ఆమె మాట్లాడిన మాటలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా గులాబీ పార్టీలో చీలిక తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కవిత.. తాజాగా ఆ దిశగా అడుగులు వేసారు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆమె కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

Also Read : అయ్యర్ ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలి..?: అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!

తనను కలిసిన మాజీ ఎమ్మెల్యేల పేర్లను బయటపెట్టేందుకు నిరాకరించిన కవిత.. కానీ, వారు తన నాయకత్వంలో తెలంగాణ జాగృతిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని హింట్ ఇచ్చారు. దీనితో.. కేటీఆర్, హరీష్ రావుల నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న నాయకులు కవిత వైపు చూస్తున్నారా అంటూ తెలంగాణాలో చర్చ మొదలైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేయబోయే పాదయాత్రపై కవిత ఘాటుగా స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లోకి రాని కేటీఆర్, ఇప్పుడు పాదయాత్రలు చేయడం ఏంటి..? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Also Read : పాక్ పర్యటనకు ట్రంప్.. అది జరిగితేనే వస్తా..!

ఇష్యూను బట్టే నా వాదన ఉంటుంది.. పరిస్థితులకు అనుగుణంగానే నా తదుపరి వ్యూహం ఉంటుంది అంటూ కవిత క్లారిటీ ఇచ్చారు. అంటే, రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ నుంచి మరిన్ని వికెట్లు పడే అవకాశం ఉందని, దానికి కవిత రంగం సిద్దం చేసారనే మాట వినపడుతోంది. మొత్తానికి, కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో తెలియక కార్యకర్తలు గందరగోళంలో ఉంటే, కవిత వ్యాఖ్యలు పార్టీ పునాదులను కదిలించేలా ఉన్నాయి. మరి దీనిపై కేటీఆర్, హరీష్ రావు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్