Sunday, April 19, 2026 06:53 AM
Sunday, April 19, 2026 06:53 AM

కిడ్నీ వ్యాధులపై ఏపీ.. ఏఐ వార్‌..!

సాంకేతిక రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు సామాన్యుల ఆరోగ్య రక్షణకు తాను సైతం అంటూ.. సిద్ధమైంది. రాష్ట్రంలో కిడ్నీ వ్యాధుల ముప్పును ముందే పసిగట్టి, ప్రాణాలను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హలో కిడ్నీ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది. కిడ్నీ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి, బాధితులకు తక్షణ వైద్య సాయం అందించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. చాలా మందికి కిడ్నీ సమస్యలు ఉన్నాయని తెలిసేసరికే పరిస్థితి విషమిస్తోంది.

Also Read : మెటాలో 8,000 మంది ఇంటికే.. భారత్‌ పై ప్రభావం ఎంత..?

అందుకే హలో కిడ్నీ ద్వారా వైద్య సిబ్బంది నేరుగా ప్రజల ఇంటి వద్దకే వస్తారు. అత్యాధునిక ఏఐ సాంకేతికత మరియు రియల్ టైమ్ డేటా అనలిటిక్స్‌ ను ఉపయోగించి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహిస్తారు. రోగులు ఆసుపత్రులకు వెళ్లి గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా నిమిషాల్లోనే ఫలితాలు వెల్లడిస్తారు. సాధారణంగా కిడ్నీ పనితీరు తెలుసుకోవడానికి క్రియాటినిన్, ఈజీఎఫ్‌ఆర్‌ వంటి పరీక్షలు చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రక్తం నమూనా సేకరించిన కేవలం 60 సెకన్లలోనే కిడ్నీ పనితీరును అంచనా వేస్తారు.

Also Read : ఢిల్లీలో రేవంత్ సెన్సేషన్.. ఎన్డియే ఎంపీలతో బ్రేక్ ఫాస్ట్..!

ఈ రిపోర్ట్స్ ఆధారంగా బాధితులకు ఏ స్థాయిలో చికిత్స అవసరమో వైద్యులు వెంటనే నిర్ణయిస్తారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం మొదటగా ఎన్టీఆర్ మరియు అనంతపురం జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించింది. అక్కడ వచ్చే ఫలితాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. ఇంటి వద్దకే వైద్యం అందించడం వల్ల పేదవారికి వ్యయప్రయాసలు తగ్గడమే కాకుండా, కిడ్నీ వ్యాధుల వల్ల జరిగే మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీకి మోదీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి...

ఏపీలో స్లీపర్ బస్సుల...

దేశంలో.. దూరప్రాంత ప్రయాణాలకు అత్యంత ఆదరణ...

చిన్నారి పునర్వికకు పునర్జన్మ.....

ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక...

మెటాలో 8,000 మంది...

ఏఐ అడుగుపెట్టిన తర్వాత టెక్ రంగంలో...

ఢిల్లీలో రేవంత్ సెన్సేషన్.....

దేశ రాజధాని ఢిల్లీలో డీలిమిటేషన్, మహిళా...

ఏపీకి మరో భారీ...

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా...

పోల్స్