Sunday, April 19, 2026 11:58 AM
Sunday, April 19, 2026 11:58 AM

గెలుపు కోసం రంగంలోకి వైసీపీ కొత్త నేత..!

వైసీపీ టార్గెట్ 2029 అంటున్నారు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. అయితే వైసీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల కంటే కూడా.. తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి నియోజకవర్గాలపైనే వైసీపీ అధినేత ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తే.. పార్టీకి అనుకూల వాతావరణం వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం సరైన ఇంఛార్జులు కూడా లేక వైసీపీ క్యాడర్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇక మరి కొన్ని చోట్ల అయితే.. అసలు ఇప్పుడు ఉన్న నేత రేపు ఉంటాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : రాజకీయాలకు బొత్స గుడ్ బై..?

కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ వరుసగా గెలుస్తుంటే.. కొన్ని చోట్ల మాత్రం వైసీపీని గెలుపు వెక్కిరిస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలో వైసీపీ వరుసగా గెలుస్తుంటే.. పర్చూరులో మాత్రం వరుసగా మూడుసార్లు ఓడిపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా పర్చూరులో గెలవాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వర్రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014 నుంచి పర్చూరులో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఏలూరి సాంబశివరావు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఏలూరి.. 2019 వైసీపీ హవాలో సైతం మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర్రావుపై 1,647 ఓట్ల తేడాతో గెలిచారు.

ఈ నియోజకవర్గంలో ఏలూరి సాంబశివరావుకు తిరుగే లేదనే మాట ఇప్పుడు వైసీపీ నేతలను కలవరపెడుతోంది. నిజానికి వైసీపీకి సరైన అభ్యర్థి లేరనే చెప్పాలి. 2014లో గొట్టిపాటి భరత్ కుమార్ పోటీ చేయగా.. 2019లో ముందు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే అతనికి భారతీయ పౌరసత్వం లేకపోవడంతో.. చివరి నిమిషంలో వెంకటేశ్వర్రావు పోటీ చేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో యడం బాలాజీ పోటీ చేసి ఏలూరి చేతుల్లో 24 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత యడం బాలాజీ నియోజకవర్గానికి దూరమైనట్లు తెలుస్తోంది. రెండేళ్లల్లో కనీసం ఒక్కసారి కూడా పర్చూరు వైపు బాలాజీ చూడలేదు. పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించలేదు. దీంతో తెరపైకి ఐదో కృష్ణుడిని తీసుకువచ్చారు వైసీపీ పెద్దలు.

Also Read : దక్షిణాది అస్తిత్వ పోరాటం.. పరిశీలకుల ఇంట్రస్టింగ్ కామెంట్స్..!

తాజాగా పర్చూరు నియోజకవర్గం వైసీపీ బాధ్యతలను మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు గాదె మధుసూదన్ రెడ్డికి అప్పగించింది. మధుసూదన్ రెడ్డి ఇప్పటి వరకు హైదరాబాద్‌లో వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఆయన పర్చూరులో ఇటీవల నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశానికి వైసీపీ ముఖ్యనేతలే ముఖం చాటేశారు. ఇందుకు ప్రధాన కారణం.. గతంలో గాదె వెంకటరెడ్డి వ్యవహరించిన తీరు అని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. భరత్, హితేష్, వెంకటేశ్వర్రావు, బాలాజీ.. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి.. ఇలా 12 ఏళ్లల్లో ఐదుగురు ఇంఛార్జులు మారడంతో పార్టీ క్యాడర్‌లో సైతం నిరుత్సాహం కనిపిస్తోంది. తాజాగా నియోజకవర్గాల పునర్ విభజన అనే అంశం తెరపైకి రావడంతో.. ఈ ఐదో కృష్ణుడు అయినా ఉంటాడా.. లేక చివర్లో మారిపోతాడా.. అని జోకులు వేసుకుంటున్నారు పర్చూరు వైసీపీ నేతలు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టార్గెట్ ధర్మాన, బొత్స.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి....

ఏపీకి మోదీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి...

ఏపీలో స్లీపర్ బస్సుల...

దేశంలో.. దూరప్రాంత ప్రయాణాలకు అత్యంత ఆదరణ...

చిన్నారి పునర్వికకు పునర్జన్మ.....

ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక...

మెటాలో 8,000 మంది...

ఏఐ అడుగుపెట్టిన తర్వాత టెక్ రంగంలో...

ఢిల్లీలో రేవంత్ సెన్సేషన్.....

దేశ రాజధాని ఢిల్లీలో డీలిమిటేషన్, మహిళా...

పోల్స్