Sunday, September 20, 2026 02:51 AM
Sunday, September 20, 2026 02:51 AM

మయాంక్ యాదవ్ ఈజ్ బ్యాక్..?

ఇండియన్ క్రికెట్ స్పీడ్ గన్, గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో భయపెట్టే మయాంక్ యాదవ్ మళ్ళీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌ లకు దూరమైన ఈ యువ పేసర్, ఇప్పుడు పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించినట్లు లక్నో సూపర్ జెయింట్స్ మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది. మయాంక్ యాదవ్‌ కు ఫిట్నెస్ సమస్యలు లేవని, కేవలం మ్యాచ్ రెడీనెస్.. పెంచుకోవడానికే అతనికి విశ్రాంతి ఇచ్చామని లక్నో డైరెక్టర్ టామ్ మూడీ స్పష్టం చేశాడు.

Also Read : ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. రోహిత్ కష్టమేనా..?

గతంలో వెన్ను గాయం కారణంగా సర్జరీ చేయించుకున్న మయాంక్ విషయంలో రిస్క్ తీసుకోకూడదని మేనేజ్‌మెంట్ భావించింది. నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోయే బెంగళూరుతో మ్యాచ్ కోసం మయాంక్ అందుబాటులోకి వచ్చాడు. మంగళవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన నెట్స్ ప్రాక్టీస్‌ లో మయాంక్ తన ట్రేడ్‌ మార్క్ వేగంతో బౌలింగ్ చేశాడు. బౌలింగ్ కోచ్ బి.అరుణ్‌ తో సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత అతను పూర్తి స్థాయిలో బౌలింగ్ చేస్తున్నట్లు కనిపించింది.

Also Read : శాంతి వెనుక.. ఇద్దరు మాజీ మంత్రులు..? బయటకు తీసుకురావడానికి కష్టాలు..!

గాయాల రికార్డు ఉన్నప్పటికీ, మయాంక్ మీద ఉన్న నమ్మకంతో లక్నో ఫ్రాంచైజీ అతన్ని 11 కోట్ల రూపాయలకు రిటెయిన్ చేసుకుంది. మయాంక్‌ తో పాటు మోసిన్ ఖాన్ కూడా ఫిట్నెస్ సాధించడంతో లక్నో బౌలింగ్ విభాగం ఇప్పుడు అత్యంత పటిష్టంగా మారింది. బెంగళూరు జట్టులో ఉన్న లాంటి స్టార్ బ్యాటర్లను మయాంక్ తన వేగంతో ఎలా కట్టడి చేస్తాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్