Saturday, September 19, 2026 09:15 PM
Saturday, September 19, 2026 09:15 PM

శాంతి వెనుక.. ఇద్దరు మాజీ మంత్రులు..? బయటకు తీసుకురావడానికి కష్టాలు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఆమెను ఏసీబీ కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఏసీబీ అధికారులు ఆమెను లోతుగా విచారించనున్నారు. ఈ విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Also Read : సజ్జల గారి వింత లెక్కలు..!

కె.శాంతికి గత ప్రభుత్వంలోని వైసీపీ కీలక నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని విలువైన దేవాలయ భూముల కేటాయింపుల్లో ఆమె చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు, ఒక మాజీ రాజ్యసభ సభ్యుడి అండదండలతోనే ఆమె వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని, కోట్లాది రూపాయల విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.

Also Read : అమెరికా ఫ్లైట్ ఎక్కనున్న కేసీఆర్.. రీజన్ ఇదేనా..?

ప్రస్తుతం ఆమె ఏసీబీ కస్టడీలో ఉండటంతో, తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని సదరు రాజకీయ నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. అందుకే, ఆమెను ఎలాగైనా బయటకు తీసుకురావడానికి సదరు ఇద్దరు మాజీ మంత్రులు, రాజ్యసభ ఎంపీ తెరవెనుక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. న్యాయపరమైన లొసుగుల ద్వారా ఆమెకు బెయిల్ వచ్చేలా చేయడం లేదా విచారణను నీరుగార్చడం వంటి వ్యూహాలకు వారు ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

విశాఖలో దేవాలయ భూముల అక్రమ విక్రయాలు, ఆక్రమణల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు..? కె.శాంతి వెనుక ఉన్న ఆ బిగ్ షాట్స్ పేర్లు ఏసీబీ విచారణలో బయటపడతాయా..? అనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ఏప్రిల్ 15 నుంచి జరిగే రెండు రోజుల కస్టడీ విచారణ తర్వాత ఈ కేసులో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేవాలయ భూముల అక్రమాలపై కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో, ఈ కేసులో రాజకీయ ప్రముఖుల పేర్లు బయటపడితే అది సంచలనమే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్