Wednesday, April 15, 2026 10:09 AM
Wednesday, April 15, 2026 10:09 AM

తిరుమలలో ఆ దర్శనం రద్దు..!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఓ వైపు ఇంటర్, పదవ తరగతి పరీక్షలు పూర్తి కావడం, తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాలు రావడంతో.. భక్తులు పెద్ద ఎత్తున ముక్కులు తీర్చుకునేందుకు తిరుమల చేరుకుంటున్నారు. సాధారణ రోజుల్లో సైతం సుమారు 72 వేల మంది పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. నిత్యం 32 వేల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారు. అటు హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో ఉంటుంది. ఒక్క రోజే రూ.4.59 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.

Also Read : శాంతి వెనుక.. ఇద్దరు మాజీ మంత్రులు..? బయటకు తీసుకురావడానికి కష్టాలు..!

వేసవిలో భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి అన్న విద్యా సంస్థలకు ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. దీంతో రద్దీ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో.. తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇప్పటికే శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఎస్ఎస్‌డీ టోకెన్ లేకుండా క్యూ లైన్‌లోకి వెళ్లి కంపార్ట్‌మెంట్‌లో ఉన్న వారికి 15 గంటల నుంచి 18 గంటలు వేచి ఉండాల్సి వస్తుంది. ఎస్ఎస్‌డీ టోకెన్ ఉన్న భక్తులను టైమ్ స్లాట్‌ ప్రకారం అనుమతిస్తున్నారు. వారికి 4 నుంచి 6 గంటల పడుతుంది.

Also Read : అమెరికా ఫ్లైట్ ఎక్కనున్న కేసీఆర్.. రీజన్ ఇదేనా..?

వేసవిలో నిత్యం లక్ష మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. మే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వేసవిలో అధిక రద్దీ కారణంగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల సిఫార్సు లేఖల పై ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు తమ యాత్రను అందుకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని, ఇతర దర్శన విభాగాలను ఎంచుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. వేసవి కాలంలో అధిక సంఖ్యలో వచ్చే యాత్రికులను నిర్వహించి, అందరికీ సులభమైన దర్శనం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నా భార్యకు భద్రత...

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

వాళ్లిద్దరు కలిశారు సరే.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు...

వైసీపీ రాజకీయ పార్టీనా.....

వైసీపీ నేతల వరుస ప్రకటనలు ఇప్పుడు...

బ్రేకింగ్: కేసీఆర్ కు...

తెలంగాణ పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ...

టీడీపీ నేతలపై అధిష్టానం...

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...

అమరావతి వేదికగా సాకారమవుతున్న...

ప్రపంచ క్వాంటం డే పురస్కరించుకుని దేశ...

పోల్స్