ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. తన సంస్థాగత నిర్మాణంలో భారీ మార్పులు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ, రాష్ట్ర కమిటీలతో పాటు పొలిట్‌బ్యూరో ను అధికారికంగా ప్రకటించింది. ఈ నూతన కూర్పులో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూనే, సీనియర్లకు గౌరవం, యువతకు ప్రాధాన్యతనిచ్చేలా అధినేత, సిఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి, విధేయత, అనుభవం ప్రాతిపదికగా ఈ పదవులను కేటాయించారు.
Also Read : తిరుమలలో ఆ దర్శనం రద్దు..!
ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన చూపిన చొరవకు ఈ పదోన్నతి దక్కింది. గత ఏడాది నుంచి లోకేష్ కు ఈ పదవి దక్కుతుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక అదేవిధంగా, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా మరోసారి పల్లా శ్రీనివాసరావును నియమించారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా బలమైన బీసీ నేతగా ఉన్న పల్లాకు మరోసారి ఈ బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు.
Also Read : శాంతి వెనుక.. ఇద్దరు మాజీ మంత్రులు..? బయటకు తీసుకురావడానికి కష్టాలు..!
ఈ కమిటీల ఎంపికలో అధిష్టానం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించింది. ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు దక్కని కీలక నేతలకు పార్టీ పదవుల ద్వారా న్యాయం చేయాలని భావించింది. సామాజిక న్యాయం పాటిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు కమిటీల్లో సముచిత స్థానం కల్పించారు. రాబోయే కాలంలో పార్టీని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లేందుకు అనుభవజ్ఞులు, ఉత్సాహవంతులైన కొత్త నాయకుల కలయికతో ఈ జాబితాను రూపొందించారు.

