Tuesday, April 14, 2026 08:30 PM
Tuesday, April 14, 2026 08:30 PM

సజ్జల గారి వింత లెక్కలు..!

సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి గారి ‘వింత’ లెక్కలు.. ఇప్పుడు ఈ మాట బాగా వినిపిస్తోంది. గజం ధరలో గారడీలు అంటూ సోషల్ మీడియాలో మరోసారి సజ్జల రామకృష్ణా రెడ్డి బాగోతం బట్టబయలైంది. వైసీపీ నేతలు ​అమరావతి అన్నదాతల కడుపు కొట్టాలనే కుతంత్రం పన్నారనేది ఇప్పుడు లెక్కలతో సహా రుజువైంది. మార్కెట్ ధరకు, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరకు కూడా తేడా తెలియని సజ్జల రామకృష్ణారెడ్డి అంకెల గారడితో సరికొత్త అక్కసుతో తెర పైకి వచ్చారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రస్తుత మార్కెట్ ధర గజం కనిష్ఠం రూ.30 వేలు కాగా గరిష్ఠంగా రూ.70 వేలు ఉంది. అయితే సకల మేధావి మాత్రం.. కేవలం రూ.6 వేల మాత్రమే అని తేల్చేశారు. ఈ మేధావి చెప్పిన అంకెలు ఇప్పుడు వైసీపీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Also Read : వైసీపీ రాజకీయ పార్టీనా.. ఉగ్రవాద సంస్థనా?

ప్రస్తుతం కనిష్ట ధర రూ.30 వేలుగా లెక్కేసినా సరే.. మిగిలిన రూ.24 వేల తేడాను కాకి లెక్కలతో సజ్జల మింగేయడంపై అమరావతి అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ​ప్రభుత్వానికి మిగిలే 5 వేల ఎకరాల ప్రస్తుత కనిష్ఠ అసలు విలువ రూ.72,600 కోట్లు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి లెక్కల్లో అది కేవలం రూ.18 వేల కోట్లేనట.! రాష్ట్ర సంపదను ఇంతలా తగ్గించి చూపడంలో సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాతే ఎవరైనా – ఆయన లెక్కలు చూసి ప్రపంచ స్థాయి ఆర్థికవేత్తలే షాక్ అవుతున్నారు.!

​సజ్జల మాటలకు.. రైతులు, వ్యాపారులు, ఏపీ వాసులు ఘాటుగా బదులిస్తున్నారు.

సజ్జల మాట: “రాజధానిలో ప్రభుత్వ రికార్డుల ప్రకారం గజం భూమి ధర రూ.6 వేలు మాత్రమే.. వచ్చేది రూ.18 వేల కోట్లు మాత్రమే.

కౌంటర్: అయ్యా సజ్జల గారు.. మార్కెట్‌లో కనిష్ఠ ధర గజం రూ.30,000 ఉంది. ఆ లెక్కన 5 వేల ఎకరాల విలువ రూ.72,600 కోట్లు. మీరు చెప్పే రూ.18 వేల కోట్లకు, వాస్తవానికి ఉన్న రూ.54,000 కోట్ల తేడాను ఏ అకౌంట్‌లో వేద్దాం.? రిజిస్ట్రేషన్ రేటుకే భూమి అమ్మే దాతలు మీకేమైనా తారసపడ్డారా.? పోనీ, వారానికి ఒకసారి మీరు వెళ్లే ఆ ఇనుప కంచెల తాడేపల్లి ప్యాలెస్‌ను ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరకే రాసి ఇచ్చేస్తారా.?

సజ్జల మాట: “చంద్రబాబు ఇంటి విలువ గజం రూ.7,500 చొప్పున లెక్కపెడితే రూ.3.63 కోట్లు.

కౌంటర్: బ్రహ్మాండం! అదే లాజిక్ వాడితే.. రాష్ట్రవ్యాప్తంగా ఏ సామాన్యుడి ఇల్లు అయినా పేపర్ మీద లక్షల్లోనే ఉంటుంది. కానీ మార్కెట్‌లోకి వెళ్తే కోట్లు పలుకుతుంది. ఐదేళ్ల పాటు సలహాదారుడి హోదాలో ఉండి, ఈ దారుణ లెక్కలతో ప్రజల సొమ్మును కోట్ల రూపాయల జీతభత్యాలుగా ఎలా మింగేశారు సార్.? అయినా ప్రస్తుతం చంద్రబాబు ఇంటి దగ్గర మార్కెట్ ధర కనిష్ఠం రూ.55 వేలు, కమర్షియల్ అయితే రూ.70 వేలు పలుకుతోంది. ఈ ‘ఓనమాలు’ తెలియకుండా మీరు అంకెలు ఎలా వేస్తున్నారు?

Also Read : నా భార్యకు భద్రత ప్లీజ్.. బ్రదర్ అనీల్ లేఖ..!

​సజ్జల మాట: “వడ్డీలే రూ.3 లక్షల కోట్లు అవుతాయి.. రాష్ట్రంపై భారం మాటేంటి.?”

కౌంటర్: అయ్యా తలమాసిన మేధావి గారూ.. కేంద్రం బడ్జెట్‌లో కేటాయించినవి, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇచ్చే రుణాలు అన్నీ కలిపినా 50 వేల కోట్లు కూడా దాటవు. పైన కేంద్రం గ్యారంటీ ఉంది. మరి నీకు అమరావతి మీద ఇప్పటికే రూ.2.5 లక్షల కోట్ల రుణం తెచ్చినట్లు కల వచ్చిందా? మీ ఐదేళ్ల పాలనలో, ప్రభుత్వ పరపతి పడిపోయి మీరు చేసిన అత్యధిక వడ్డీ అప్పులకు వడ్డీలు కట్టడానికి ప్రస్తుతం ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమి కావాలో లెక్కేస్తే మీ బండారం బయటపడుతుంది!

​అమరావతిలో భూమి అమ్మేటప్పుడు మీరిచ్చే రూ.6 వేల రేటుకి ఎవరూ రారు. మీ దగ్గర ఉన్న ‘కాలిక్యులేటర్లను ఒక్కసారి రిపేర్ చేయించుకోండి లేదా ఎవరిదైనా పిల్లల పాత అబాకస్ పలకను వాడండి. రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి గజం లక్ష దాటుతుందని అంచనా. అప్పుడు ఆ 5 వేల ఎకరాల భూమి విలువ రెండున్నర లక్షల కోట్లు దాటుతుంది. అప్పటికి ప్రభుత్వం చేసే ఖర్చు 50 వేల కోట్లు కూడా ఉండదు. అందుకే చంద్రబాబు మీద నమ్మకంతో ప్రపంచ బ్యాంక్ రుణాలు ఇస్తోంది కేంద్రం గ్యారెంటీ ఇచ్చింది. మీ కాకి లెక్కలను కనీసం మీ కార్యకర్తలు నమ్మి “అమరావతి భూములు కొని ఇవ్వమని” వస్తే.. వారికి నీ తప్పుడు కూతల మొహం చూపించుకోలేవు. మీకు ఆ ధరలకు అమ్మే ‘పిచ్చి అన్నదాతలు’ ఉన్నారని మీరు భ్రమపడితే.. దయచేసి వారికి కనిపించకండి. ఇలాంటి పైత్యపు వాగుడు వాగితే, తాడేపల్లిలో జగన్ అడుగు పెట్టాలంటే మళ్లీ పాతకాలం నాటి పరదాలు, ఇనుప వలలు కొనుక్కోవాల్సి వస్తుందేమో, జాగ్రత్త.! ​కాదంటే అమరావతి అన్నదాతల కడుపు కొట్టాలని మీరు ఈ కాకి లెక్కలు చెబుతున్నట్లున్నారు. మీ వైసీపీ మీద కాకి రెట్ట కూడా పడకుండా, మీరే చాలా లోతుగా గొయ్యి తవ్వుకుంటున్నారు! ఇలాంటి పిచ్చి “మావిగన్” స్క్రిప్ట్ ఇచ్చి జగన్ ను జోకర్ చేశావు. కార్యకర్తలు, నాయకులు తలెత్తుకుని తిరగకుండా చేస్తున్నావు. ఈ విషయంలో మీకు డబుల్ హ్యాట్సాఫ్. ప్రజల తరపున ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు.” అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డిపై అమరావతి అన్నదాతలు, ఏపీ ప్రజలలు విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నా భార్యకు భద్రత...

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

వాళ్లిద్దరు కలిశారు సరే.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు...

వైసీపీ రాజకీయ పార్టీనా.....

వైసీపీ నేతల వరుస ప్రకటనలు ఇప్పుడు...

బ్రేకింగ్: కేసీఆర్ కు...

తెలంగాణ పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ...

టీడీపీ నేతలపై అధిష్టానం...

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...

అమరావతి వేదికగా సాకారమవుతున్న...

ప్రపంచ క్వాంటం డే పురస్కరించుకుని దేశ...

పోల్స్