Tuesday, August 4, 2026 05:51 PM
Tuesday, August 4, 2026 05:51 PM

భోగాపురం ముహుర్తం ఫిక్స్..!

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. పనులు దాదాపు పూర్తికావడంతో జులై లేదా ఆగస్టులో తొలి విమానం ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని తాజా అంచనాలు సూచిస్తున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రపంచంతో నేరుగా అనుసంధానం కలగనుంది. దీంతో వ్యాపారం, పర్యాటకం, పెట్టుబడులు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read : బ్రేకింగ్ : రెడ్డప్పగారి మాధవి, బీటెక్ రవిపై లోకేష్ సీరియస్

జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న ఈ ఎయిర్ పోర్ట్ పనులు ఇప్పటికే 97 శాతం పూర్తయ్యాయి. ఎర్త్ రన్ వే పనులు పూర్తయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ పనులు సుమారు 95 శాతం పూర్తి అయ్యాయి. రహదారి కనెక్టివిటీ పనులు కూడా చివరి దశలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం జులై 5 లేదా 8 తేదీల్లో, లేదంటే ఆగస్టు 17 లేదా 19 తేదీల్లో ఏదో ఒక రోజు విమానాశ్రయాన్ని ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది. అదే సమయంలో తొలి ఫైట్ ల్యాండింగ్ కూడా జరగనుందని అధికారులు భావిస్తున్నారు.

గతంలో “ఎర్రబస్సు కూడా రాని ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ అవసరమా?” అంటూ విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు సిద్ధమవుతోంది. అసలు ఎయిర్ పోర్టు అవసరం లేదన్న వైసీపీ నేతలు.. చివరికి రన్ పై విమానం ట్రైల్ రన్ నిర్వహించిన తర్వాత.. మా వల్లే విమానాశ్రయం వచ్చిందని.. క్రెడిట్ కోసం పాకులాడుతున్నారు.

Also Read : దేవాదాయ శాఖలో ఏసీబీ “శాంతి” హోమం..!

అసలు షెడ్యూల్ ప్రకారం ఈ ప్రాజెక్టు ఇప్పటికి పూర్తి కావాల్ని ఉన్నప్పటికీ, కొంత ఆలస్యంతోనైనా ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమవుతుండటంతో విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. త్వరలోనే తొలి విమానం ల్యాండ్ అవుతుందన్న ఆశతో ఉత్తరాంధ్ర మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్