Saturday, September 19, 2026 12:05 PM
Saturday, September 19, 2026 12:05 PM

ఇరాన్‌ లో ఏం జరుగుతోంది..? అపస్మారక స్థితిలో సుప్రీం లీడర్..?

యుద్ధం మొదలైన నాటి నుంచి ఇరాన్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తండ్రి అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ గా పగ్గాలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ (56) ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా సంచలన విషయం బయటపెట్టింది. ఇరాన్ లోని పవిత్ర నగరంగా భావించే.. కోమ్ లో ఆయన అత్యవసర చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని తెలిపింది. అయితే ఆయన మరణించారు అనే వార్తలు కూడా వచ్చాయి.

Also Read : బ్రేకింగ్: ముగింపు దిశగా యుద్ధం..? ట్రంప్ డెడ్‌ లైన్ వేళ ఉత్కంఠ..!

ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది టైమ్స్ కథనం ప్రకారం.. గతంలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భీకర దాడుల్లో మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. అదే దాడుల్లో ఆయన తండ్రి, ఇరాన్ కు దీర్ఘకాలిక సుప్రీం లీడర్ గా పని చేసిన.. అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆ గాయాల నుండి మొజ్తబా ఇంకా కోలుకోలేదని, తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించి అపస్మారక స్థితిలోకి వెళ్లారని బయటపెట్టింది. మొజ్తబా ఖమేనీ చికిత్స పొందుతున్న కోమ్ నగరంలోని ఆసుపత్రి పరిసరాలను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నాయని పేర్కొంది.

Also Read : అదిరిపోయిన రష్మిక బర్త్ డే గిఫ్ట్..!

ఆయన పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. అయితే, ఇరాన్ అధికారిక మీడియా మాత్రం ఈ వార్తలపై ఇంకా ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇది దేశంలో అధికార మార్పిడికి సంబంధించిన అంతర్గత కుట్రనా లేక నిజంగానే ఆరోగ్య వైఫల్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ పగ్గాలను మొజ్తబా చేపట్టినప్పటికీ, ఆయన బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే ఇలా అస్వస్థతకు గురవ్వడం ఇరాన్ భద్రతా వ్యవస్థలో ఆందోళన కలిగిస్తోంది. మొజ్తబా ఖమేనీ గనుక కోలుకోకపోతే ఇరాన్ తదుపరి నాయకత్వం ఎవరి చేతుల్లోకి వెళ్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్