Saturday, September 19, 2026 11:18 AM
Saturday, September 19, 2026 11:18 AM

త్రిష షాకింగ్ నిర్ణయం..? సినిమాలకు గుడ్ బై..!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో.. దాదాపుగా రెండు దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర లో నటిస్తున్న త్రిష, ఈ సినిమా తర్వాత వెండితెరకు శాశ్వతంగా దూరం కాబోతుందనే ప్రచారం జోరందుకుంది. ఒకవైపు కెరీర్ పరంగా సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటున్న తరుణంలో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

Also Read : అదిరిపోయిన రష్మిక బర్త్ డే గిఫ్ట్..!

త్రిష తన సినీ ప్రయాణానికి ముగింపు పలకాలని భావించడానికి ప్రధాన కారణం ఆమె పొలిటికల్ ఎంట్రీ అని టాక్. తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్లామర్ ప్రపంచం నుంచి ప్రజాసేవ వైపు అడుగులు వేయాలని ఆమె గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం త్రిష కెరీర్‌ లో చివరి తెలుగు సినిమాగా మిగిలిపోయే అవకాశం ఉంది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవల స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీలో త్రిష చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read : ఇరాన్‌ లో ఏం జరుగుతోంది..? అపస్మారక స్థితిలో సుప్రీం లీడర్..?

విజయ్ పార్టీ తరపున త్రిషను స్టార్ క్యాంపెయినర్ గా బరిలోకి దింపేందుకు రంగం సిద్ధమైందని కోలీవుడ్ వర్గాల టాక్. యువతలో, మహిళల్లో త్రిషకు ఉన్న విపరీతమైన ఫాలోయింగ్ తమ పార్టీకి పెద్ద ప్లస్ అవుతుందని విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ వార్తలు విన్న త్రిష అభిమానులు సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకవైపు స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో రాజకీయాల్లోకి వెళ్లడం అవసరమా..? అని కొందరు అంటుంటే, విజయ్ కోసం త్రిష ఈ త్యాగం చేస్తోంది అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, త్రిష నుండి ఇప్పటివరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్