Monday, March 23, 2026 06:03 PM
Monday, March 23, 2026 06:03 PM

పెట్రోల్ షార్టేజ్ లీగ్.. కామెడి పీస్ అయిన పాక్ బోర్డు..!

ఒకవైపు ఆటగాళ్ళ ప్రదర్శన మరో వైపు దేశ క్రికెట్ బోర్డు పరిణామాలు, ఇంకో వైపు దేశంలో ఉన్న ఆర్ధిక సంక్షోభం అన్నీ కలగలిసి పాక్ క్రికెట్ బోర్డును రోజు రోజుకి దిగజారుస్తున్నాయి. తాజాగా ఆ దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్‌ కు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఆకస్మిక నిర్ణయాలు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి. దేశంలో నెలకొన్న తీవ్రమైన ఇంధన సంక్షోభం కారణంగా ఈసారి టోర్నీని నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించడంతో విమర్శలు వస్తున్నాయి.

నెటిజన్లు దీనిని పాకిస్థాన్ సూపర్ లీగ్ కాస్తా.. పెట్రోల్ షార్టేజ్ లీగ్ గా ఎగతాళి చేస్తున్నారు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మార్చి 22న జరిగిన విలేకరుల సమావేశంలో లీగ్‌ లో పలు కీలక మార్పులను ప్రకటించారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించకూడదని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ప్రజల రాకపోకలను తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపధ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు నఖ్వీ తెలిపారు. గతంలో ఆరు నగరాల్లో నిర్వహించాలనుకున్న టోర్నీని ఇప్పుడు కేవలం లాహోర్, కరాచీలకు మాత్రమే పరిమితం చేశారు.

ఇంధన వనరులను ఆదా చేసేందుకు లాహోర్‌ లో జరగాల్సిన గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీని రద్దు చేశారు. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు 72 గంటల్లోగా నగదు వెనక్కి ఇస్తామని బోర్డు ప్రకటించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా పాకిస్థాన్‌లో చమురు సరఫరా దెబ్బతింది. దీంతో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించి, వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనలు అమలు చేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య పీఎస్ఎల్ నిర్వహించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు భారత్‌లో ఐపీఎల్ 2026 భారీ ఎత్తున ప్రేక్షకుల మధ్య జరుగుతుంటే, పీఎస్ఎల్ మాత్రం ఖాళీ స్టేడియాల్లో జరగడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంధన సంక్షోభం, భద్రతా కారణాల దృష్ట్యా కొందరు విదేశీ ఆటగాళ్లు లీగ్ నుంచి తప్పుకుని ఐపీఎల్‌ కు వెళ్లడం కూడా పీసీబీకి తలనొప్పిగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

శ్రీశైలం డ్యామ్ పునాదులు...

రెండు తెలుగు రాష్ట్రాల సాగు, జల...

కావలి టీడీపీలో గ్రూపు...

ఓ వైపు టీడీపీ అధిష్టానం, సిఎం...

జగన్‌తో ఒంటరి పోరాటం...

ఉమ్మడి కడప జిల్లాలో ఆ ఎమ్మెల్యే...

ఏపీలో ఏనుగు దంతాల...

వన్య ప్రాణుల భద్రత విషయంలో ప్రభుత్వాలు...

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

పోల్స్