Wednesday, May 13, 2026 06:50 PM
Wednesday, May 13, 2026 06:50 PM

కావలి టీడీపీలో గ్రూపు వార్.. ఏఎంసీ డైరెక్టర్‌ పై దాడి..!

ఓ వైపు టీడీపీ అధిష్టానం, సిఎం చంద్రబాబు నాయుడు పరిపాలనపై దృష్టి సారిస్తున్న క్రమంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఏదోక నియోజకవర్గంలో ఏదోక తలనొప్పి చికాకుగా మారింది. తాజాగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో టీడీపీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. అధికార పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య రేగిన వివాదం భౌతిక దాడికి దారితీయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. గత కొంత కాలంగా సాగుతోన్న ఈ వర్గ పోరు ఇప్పుడు తారాస్థాయికి చేరింది.

Also Read : తిరుమల పర్యటనపై రాజకీయాలు.. మీరు మారరా..?

క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే పార్టీలో నేతలు నడిరోడ్డుపై దాడులకు, బహిరంగ విమర్శలకు దిగడం కలకలం రేపుతోంది. కావలి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పవన్ కుమార్‌ పై ప్రత్యర్థి వర్గం చేసిన దాడి, ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బాధితుడు పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కావలి పట్టణంలోని తుమ్మలపెంట రోడ్డులో ఉన్న ఒక దాబా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పవన్ కుమార్ తన కారులో దాబా వద్దకు చేరుకుని, కారు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా కొందరు వ్యక్తులు ఆయనపై దాడికి దిగారు.

Also Read : కమ్మిన్స్ దెబ్బ హైదరాబాద్ కు గట్టిగానే..?

పక్కా ప్లాన్ ప్రకారం అక్కడే మాటు వేసిన నిందితులు, పవన్‌ ను చుట్టుముట్టి మూకుమ్మడిగా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడి వెనుక కావలి పట్టణ టీడీపీ ఉపాధ్యక్షుడు దేవరకొండ శ్రీను ఉన్నారని బాధితుడు పవన్ కుమార్ బహిరంగంగా ఆరోపించారు. పాత కక్షలు, పార్టీలో ఆధిపత్య పోరు కారణంగానే తనపై ఈ దాడి చేయించారని ఆయన పేర్కొన్నారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ ఘాతుకానికి ఒడిగట్టడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడమేనని పవన్ మద్దతుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడి సమాచారం అందుకున్న కావలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడు పవన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవరకొండ శ్రీను, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో, కీలక పదవుల్లో ఉన్న నేతలే ఇలా వీధిన పడటంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ ట్వీట్స్ కు...

ఏపీ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి...

పొదుపు మొదలుపెట్టిన మోడీ.....

ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రభుత్వ...

అమరావతి, పోలవరం ఆపాలా..?...

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా...

రామ్ చరణ్ ‘పెద్ది’...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

ఆంధ్ర న్యూస్ 9...

మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి...

ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులతో...

అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచ స్థాయికి...

పోల్స్