Wednesday, May 13, 2026 06:52 PM
Wednesday, May 13, 2026 06:52 PM

బోట్ల చోరీలో ఎంపీ హస్తం..? క్లారిటీ ఇచ్చిన బీద మస్తాన్‌..!

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ లో చోటుచేసుకున్న మరబోట్ల అదృశ్యం వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ వివాదంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్‌రావు స్పందించారు. దాదాపుగా ఆరు నెలల క్రితం తమిళనాడుకు చెందిన నాలుగు మరబోట్లు నెల్లూరు తీరంలో అక్రమంగా చేపల వేట సాగించే క్రమంలో స్థానిక మత్స్యకారులు వాటిని పట్టుకుని, జువ్వలదిన్నె హార్బర్‌కు తరలించి అక్కడే ఉంచారు. అయితే, ఇటీవల ఆ నాలుగు బోట్లు హార్బర్ నుంచి రహస్యంగా మాయమవ్వడం కలకలం రేపింది.

Also Read : కమ్మిన్స్ దెబ్బ హైదరాబాద్ కు గట్టిగానే..?

తమిళనాడుకు చెందిన జాలర్లు వచ్చి తమ బోట్లను తాము తీసుకెళ్లారని ప్రచారం జరుగుతున్న క్రమంలో, దీని వెనుక స్థానిక రాజకీయ నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఇక దీనిపై ఎంపీని టార్గెట్ చేయడంతో ఒక్కసారిగా వివాదం రేగింది. దీనిపై స్పందించిన ఎంపీ.. బోట్ల తరలింపులో కానీ, ఆ వ్యవహారంలో కానీ నా పాత్ర ఏమాత్రం లేదని స్పష్టం చేసారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల మత్స్యకారుల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆవేదన వ్యక్తం చేసారు. దశాబ్దాలుగా తాను మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటున్నానని, వారి హక్కుల కోసం పోరాడుతున్నానని గుర్తుచేశారు.

Also Read : ఏపీ పారిశ్రామిక రంగంలో గొప్ప ముందడుగు

బోట్లు ఎలా మాయమయ్యాయి..? దీని వెనుక ఎవరున్నారు..? అనే కోణంలో అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు, స్థానిక మత్స్యకారులు మాత్రం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్బర్‌ లో భద్రత ఉన్నప్పటికీ, అంత పెద్ద బోట్లు ఎలా అదృశ్యమవుతాయనే ప్రశ్నలు రావడం అలాగే.. తమిళనాడు జాలర్లు వచ్చి బోట్లను తీసుకెళ్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడటంతో ఈ వ్యవహారంలో ఏం జరగబోతుందా అనే ఆసక్తి నెలకొంది. అటు పోలీసులు సీసీ ఫూటేజ్ కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ ట్వీట్స్ కు...

ఏపీ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి...

పొదుపు మొదలుపెట్టిన మోడీ.....

ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రభుత్వ...

అమరావతి, పోలవరం ఆపాలా..?...

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా...

రామ్ చరణ్ ‘పెద్ది’...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

ఆంధ్ర న్యూస్ 9...

మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి...

ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులతో...

అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచ స్థాయికి...

పోల్స్