Wednesday, May 6, 2026 09:16 PM
Wednesday, May 6, 2026 09:16 PM

యుద్ధంపై ట్రంప్ సంచలన కామెంట్స్.. ఇక ఆగినట్లే..?

ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న సుదీర్ఘ పోరాటం ఇప్పుడు క్లైమాక్స్‌ కు చేరుకుందా..? అంటే అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇరాన్ పై ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తోన్న ట్రంప్.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. తాజా పరిణామాల నేపథ్యంలో, మనం మన లక్ష్యాలకు చేరువవుతున్నాం అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని పెంచుకోకుండా అడ్డుకోవడం, ప్రాంతీయ ఉగ్రవాద గ్రూపులకు అందుతున్న సహాయాన్ని నిలిపివేయడమే అమెరికా ప్రధాన లక్ష్యం.

Also Read : హార్మూజ్ జలసంధి ఓపెన్ అవుతుందా..?

ఇరాన్ కీలక సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడులు, అలాగే హిందూ మహాసముద్రంలో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అమెరికా విజయవంతంగా అడ్డుకోవడం వంటివి ఇరాన్‌ ను ఆత్మరక్షణలో పడేసినట్లు ట్రంప్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, ఇరాన్ ఇక చర్చల మార్గంలోకి వస్తుందని భావిస్తూ ట్రంప్ యుద్ధం ముగింపు దశకు వచ్చింది అంటూ ట్రంప్ కామెంట్స్ చేసారు. యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. అమెరికా విధిస్తున్న ఆంక్షల వల్ల ఇరాన్ కరెన్సీ విలువ పడిపోవడమే కాకుండా, చమురు ఎగుమతులు నిలిచిపోయి ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.

Also Read : ఒక్క దెబ్బకు అమెరికా పరువు తీసిన ఇరాన్..!

యుద్ధం కొనసాగితే ఇరాన్ ఉనికికే ప్రమాదం అనే స్థాయికి ట్రంప్ ఒత్తిడి తీసుకువచ్చారు. దీనివల్ల ఇరాన్ పాలకులు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంతర్జాతీయ మీడియా అంటోంది. ఇప్పుడు ఇరాన్‌ తో ట్రంప్ నేరుగా చర్చలు జరిపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ చర్చలు అమెరికా షరతులపైనే జరగాలని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. ఇజ్రాయెల్ భద్రతకు హామీ ఇస్తూ, ఇరాన్ తన క్షిపణి ప్రయోగాలను నిలిపివేస్తేనే శాంతి సాధ్యమని ట్రంప్ చెప్పడం గమనార్హం. ఇరాన్‌ ను సైనికంగా బలహీనపరచడం ద్వారా, ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పవచ్చని అమెరికా భావిస్తోంది. అయితే ఇరాన్ ఎంత వరకు దారిలోకి వస్తుందో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్