Wednesday, May 6, 2026 08:20 PM
Wednesday, May 6, 2026 08:20 PM

హిందూ మహాసముద్రంలోకి అడుగుపెట్టిన యుద్ధం..?

రోజుల తరబడి సాగుతున్న ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ఇప్పుడు ఊహకు అందని తీర ప్రాంతాలకు మారుతోందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. హిందూ మహాసముద్రంలోని అమెరికా-బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డియాగో గార్సియాపై ఇరాన్ క్షిపణి దాడికి ప్రయత్నించడం యుద్ధం కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందనే ఆందోళనలను రేకెత్తించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం ఇరాన్ రెండు మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను డియాగో గార్సియా లక్ష్యంగా ప్రయోగించింది.

Also Read : షిర్డీ సాయిని వెంటాడుతున్న ఏబీవీ.. కోర్ట్ సంచలన ఆదేశాలు..!

ఈ దాడుల వల్ల ఎటువంటి నష్టం వాటిల్లలేదని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఒక క్షిపణి గాలిలోనే విఫలం కాగా, రెండో దానిని అమెరికా యుద్ధనౌక ప్రయోగించిన ఎస్ఎం-3 ఇంటర్సెప్టర్ అడ్డుకుంది. డియాగో గార్సియా అనేది బ్రిటన్ ఆధీనంలోని ఛాగోస్ దీవుల్లో ఉన్న ఒక కీలక వ్యూహాత్మక స్థావరం, దీనిని అమెరికా తన బాంబర్లు, ఇతర సైనిక కార్యకలాపాల కోసం ఉపయోగిస్తుంది. ఇరాన్ భూభాగం నుండి ఈ సైనిక స్థావరం సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పటివరకు ఇరాన్ క్షిపణుల పరిధి 2,000 కి.మీ మాత్రమేనని భావించేవారు.

Also Read : గ్రాండ్ గా రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌..!

కానీ ఈ దాడితో ఇరాన్ సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసుకుందని తేలిపోయింది. ఈ ఘటన పశ్చిమాసియా దాటి హిందూ మహాసముద్రం వరకు యుద్ధం విస్తరించిందని సంకేతాలిస్తోంది. గతంలో శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధనౌక ‘ఐరిస్ డేనా’ ను అమెరికా సబ్ మెరైన్ ముంచివేసిన నేపథ్యంలో ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికా తన స్థావరాల నుండి దాడులు చేయడానికి అనుమతి ఇస్తున్నందుకు గాను, బ్రిటన్ పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ గతంలోనే హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్