Wednesday, May 6, 2026 08:58 PM
Wednesday, May 6, 2026 08:58 PM

దురంధర్ 2 పై రాజకీయ రచ్చ..? అసలు వివాదం ఏంటీ..?

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 ది రివెంజ్.. చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ, రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఈ సినిమా కేవలం వినోదం యాంగిల్ లో కాకుండా పొలిటికల్ యాంగిల్ లో తీసారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పలు రాష్ట్రాల ఎన్నికల ముందు ఈ చిత్రాన్ని విడుదల చేయడం వెనుక బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ వ్యూహం ఉందన్నది కాంగ్రెస్ నాయకుల ప్రధాన ఆరోపణ. సినిమాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 ప్రమాణ స్వీకార కార్యక్రమం, 2016 నోట్ల రద్దు ప్రసంగానికి సంబంధించిన ఒరిజినల్ ఫుటేజీని ఉపయోగించడం చర్చనీయాంశమైంది.

Also Read : దురంధర్ ఫస్ట్ రోజు కలెక్షన్స్ ఏ రేంజ్ లో అంటే..!

వీటికి థియేటర్లలో ఒక వర్గం ప్రేక్షకులు ఈలలు వేస్తుంటే, మరికొందరు ఇది ప్రభుత్వ ప్రచార యంత్రాంగంలో భాగమని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. సినిమాలో రాజకీయ నాయకులను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని పోలిన పాత్రలను అవినీతి, ఉగ్రవాదంతో ముడిపెట్టినట్లు చూపించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సమాజ్‌ వాదీ పార్టీ ఎంపీలు సైతం దీనిని ఫేక్ ప్రొపగాండాగా అభివర్ణించారు. మేజర్ మోహిత్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కించారనే వార్తలు రావడంతో, ఆయన కుటుంబ సభ్యులు తమ అనుమతి లేకుండా కమర్షియల్ కోణంలో ఈ సినిమా తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు.

Also Read : గ్రాండ్ గా రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌..!

అయితే దర్శకుడు ఆదిత్య ధర్ ఇది పూర్తిగా కల్పితమని స్పష్టం చేశారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయని, ఇది మతపరమైన విభేదాలను ప్రోత్సహిస్తోందని విమర్శలు రావడంతో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ వంటి గల్ఫ్ దేశాలు ఈ చిత్రంపై నిషేధం విధించాయి. ఈ సినిమాపై ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీ ఈ సినిమాను ప్రొపగాండా చిత్రంగా అభివర్ణించాడు. ఆదిత్య ధర్‌ ను బీజేపీ ప్రచారకర్తగా విమర్శించాడు. త్వరలోనే ఈ సినిమాలోని వాస్తవాలను బయటపెడతానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తమిళనాడులో అధికార పార్టీ నేతలు కూడా ఈ సినిమాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్