ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. ఈ ఏడాది జూన్ నాటికి సరిగ్గా రెండేళ్లు పూర్తి. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. నిజానికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే మంత్రివర్గంలో కొత్త వారు అంటూ సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో పాటు జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి ఖాయమంటూ చంద్రబాబు 2024 డిసెంబర్ నెలలోనే ప్రకటించారు. కానీ ఏడాది దాటినప్పటికీ ఇప్పటికీ వారిద్దరికీ అమాత్య యోగం లభించలేదు. వీరితో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా మంత్రి పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
Also Read : లిక్కర్ కేసులో ఆ ఇద్దరే అంతా.. ఆస్తులు కొనేసారు..!
తాజాగా ప్రముఖ సర్వే సంస్థ రైజ్ అధినేత ప్రవీణ్ పుల్లాట సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. పొలిటికల్ సర్కిల్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. భారీ ప్రక్షాళన దిశగా కూటమి సర్కార్ కసరత్తు.. అంటూ ప్రవీణ్ పోస్ట్ చేశారు. ప్రస్తుత మంత్రివర్గంలో భారీ మార్పులు అంటూ కామెంట్ చేశారు. మెజారిటీ మంత్రులకు ఉద్వాసన తప్పదని హింట్ ఇచ్చారు. కొత్త మంత్రివర్గంలో ఖచ్చితంగా అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు.. అంటూ ఐదుగురి పేర్లు ప్రకటించారు. వీరిలో పల్లా శ్రీనివాసరావు, బెందాళం అశోక్, మద్దిపాటి వెంకటరాజు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కొణతాల రామకృష్ణకు బెర్త్ ఖాయమన్నట్లుగా ప్రవీణ్ వ్యాఖ్యానించారు. కొంచెం అటూ ఇటూ మార్పులతో లోకేష్ టీమ్‍తోనే కొత్త కేబినెట్ మార్పు ఉంటుందని.. ఉగాదికి కాకపోయినా.. భారీ మార్పులతోనే కొత్త మంత్రివర్గం ఉంటుందని వ్యాఖ్యానించారు.
Also Read : సరికొత్త వ్యూహం.. తీవ్రత పెంచిన ఇరాన్..!
పల్లా శ్రీనివాసరావుకు రెవెన్యూ శాఖ అప్పగించే అవకాశం ఉందన్న ప్రవీణ్… ఆయన స్థానంలో ప్రస్తుత మంత్రులు కొల్లు రవీంద్ర లేదా అనగాని సత్యప్రసాద్‌లలో ఒకరికి పార్టీ అధ్యక్ష స్థానం ఖాయమన్నారు. మరోసారి ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను బీసీ నేతకే అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పలువురు సీనియర్ నేతలకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన తప్పదనే మాట బాగా వినిపిస్తోంది. రెండేళ్ల పదవీ కాలంలో కొంతమందిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తగా.. మరికొందరి పనితీరుపై తొలి నుంచి విమర్శలు వస్తున్నాయి. దీంతో వారిని క్యాబినెట్ నుంచి తప్పించాలని పార్టీ నేతలు తొలి నుంచి డిమాండ్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం సరైన సమయం కోసం ఎదురు చూశారు. రాబోయే ఉగాదికి మంత్రివర్గ ప్రక్షాళన ముహుర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

