Friday, June 19, 2026 11:56 AM
Friday, June 19, 2026 11:56 AM

లిక్కర్ కేసులో ఆ ఇద్దరే అంతా.. ఆస్తులు కొనేసారు..!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో ఈడీ అధికారుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. దాదాపు ఏడాది కాలంగా సాగుతోన్న ఈ లిక్కర్ కేసు విచారణలో ఏ అంశాలు వెలుగులోకి వస్తాయో అర్ధం కాని పరిస్థితి. ఈ కేసులో కీలక వ్యక్తులుగా భావిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి వంటి వారి విచారణ ఇప్పటికే పూర్తి కాగా.. మరికొందరు నిందితులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో మరికొందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు మీడియా వర్గాల్లో వస్తున్నాయి.

Also Read : పుకార్లకు బ్రేక్ వేసేది ఎవరు..?

తాజాగా ఈడీ విచారణ ముగిసింది. సోమవారం ధనుంజయరెడ్డి, చాణక్య, వెంకటేష్ నాయుడును మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల వసూలుపై ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. వసూళ్లలో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి కీలకపాత్ర పోషించినట్లు ఈడీ అధికారులు తేల్చారు. మద్యం ముడుపుల సొమ్మును బినామీల పేరుతో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ గుర్తించింది. ఆ సొమ్మును ఎక్కడికి, ఎలా తరలించారు అనే అంశంపై పూర్తి ఆధారాలతో ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం.

Also Read : పడి లేచిన కెరటం.. పర్మినెంట్ ఓపెనర్ అయిపోయాడు..!

2019-24 మధ్య కాలంలో బినామీల పేరుతో భారీగా ఆస్తులు కొన్నట్లు ఈడీ తేల్చింది. నిందితుల స్టేట్‌మెంట్ రికార్డు చేసిన ఈడీ అధికారులు.. దాని ఆధారంగా మరో ఇద్దరు కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది. ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డిల అనుచరుల పాత్రపై కూడా ఈడీ అధికారులు విచారించినట్లు సమాచారం. అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు మరోసారి విచారించే అవకాశం ఉంది. వీరికి బెయిల్ ఇవ్వవద్దని చెవిరెడ్డి ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

పోల్స్