Friday, June 19, 2026 11:55 AM
Friday, June 19, 2026 11:55 AM

హోటల్స్ బంద్.. నిన్న బెంగళూరు, నేడు ముంబై, రేపు బెజవాడ..?

ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. పది రోజుల నుంచి నిర్విరామంగా సాగుతోన్న ఈ యుద్ద ప్రభావం చమురు నిల్వలపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా మన దేశంలో గ్యాస్ నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై అటు కేంద్రం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అటు గ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉండటం ఒకటి అయితే, కొరత మరింత భయపెడుతోంది. దీనితో కమర్షియల్ సిలెండర్ ల ఉత్పత్తి ఆపేసి.. గృహ అవసరాల కోసం తయారు చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.

Also Read : ఆఫ్ ది రికార్డు.. కొలికపూడి గురించే..!

ఇప్పుడు ఇదే హోటల్స్ కు శాపంగా మారింది. బెంగళూరు హోటల్స్ అసోసియేషన్.. నేడు హోటల్స్ మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక ముంబైలో కూడా దాదాపు అదే పరిస్థితి కనపడుతోంది. గ్యాస్ సరఫరా తగ్గడంతో.. ముంబైలోని దాదాపు 20% హోటళ్ళు, రెస్టారెంట్లు ఇప్పటివరకు మూతపడ్డాయని నగర హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ తెలిపింది. ఇదే కంటిన్యూ అయితే భవిష్యత్తులో మరింతగా మూతపడే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.

Also Read : ఇదేం క్రేజ్ దురంధర్.. రిలీజ్ కు ముందే రికార్డులు..!

రాబోయే రోజుల్లో ముంబైలోని దాదాపు సగం హోటళ్ళు మూసేసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇక ఈ ప్రభావం క్రమంగా విజయవాడలో కూడా కనపడుతోంది. విజయవాడలో హోటల్ వ్యాపారం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. టిఫిన్ బండ్ల దగ్గరి నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ ల వరకు గ్యాస్ మీదనే ఆధారపడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వీటికి గ్యాస్ కొరత ప్రభావం కనపడుతోంది. రాబోయే రోజుల్లో విజయవాడలో కూడా హోటల్స్ మూసేసే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. అటు హార్మోజ్ జల సంధి నుంచి గ్యాస్ రవాణా ఆగిపోవడంమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

పోల్స్