వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 33 ఏళ్ల దివ్వెల మాధురి.. 58 ఏళ్ల దువ్వాడతో కలిసి ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. ఈ జంట ఇప్పటికీ హైదరాబాద్‌లో వస్త్ర వ్యాపారం మొదలుపెట్టారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ భార్య తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆయన ఇంటి ముందు చేసిన రచ్చ మామూలుగా లేదు. దీంతో మాధురి ఆత్మహత్యాయత్నం.. ఇదంతా మరో ఎపిసోడ్. మొదట్లో తమ మధ్య అలాంటిదేం లేదని కప్పిపుచ్చుకున్న దువ్వాడ, దివ్వెల జంట.. ఇప్పుడు మాత్రం బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. దువ్వాడ తీరుతో తమకు తలనొప్పి ఖాయమని భయపడిన జగన్.. వైసీపీ నుంచి దువ్వాడను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : మరో దేశంపై ట్రంప్ గురి.. యుద్ధంపై సంచలన కామెంట్స్..!
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట అంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. మీడియా, పోలీసులు, రాజకీయ నేతలు.. ఇలా అందరిపైన వీరు ఒంటికాలిపై దూకిన సందర్భాలున్నాయి. నెల రోజుల క్రితం మాజీ మంత్రి ధర్మాన కృష్ణాదాస్ తనను హత్య చేస్తారని.. అందుకు తాను సిద్ధమే అని నేషనల్ హైవే మీద అర్థరాత్రి పూట వీడియో తీసి దువ్వాడ రచ్చ చేశారు. అలాగే ఈ జంట ఎక్కడికి వెళ్లినా సరే.. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం కామన్ అయిపోయింది. గతంలో తిరుమల మాఢ వీధుల్లోనే ఫోటో షూట్ చేసి వార్తల్లోకి ఎక్కారు దివ్వెల మాధురి. తిరుమల పవిత్రతను ఉల్లంఘిస్తూ దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి దివ్వెల మాధురి మాడవీధులు, పుష్కరిణి వద్ద ఫోటో షూట్, రీల్స్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. అక్టోబర్ 2024లో జరిగిన ఈ ఘటనపై భక్తుల నుంచి, టీటీడీ అధికారుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనితో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
Also Read : ఇక అంతా పబ్లిక్.. త్రిష, విజయ్ బోల్డ్ స్టెప్
ఈ కేసు ఇంకా పరిష్కారం కాకముందే.. మరో వివాదానికి తెర లేపారు దివ్వెల మాధురి. తిరుమలలోని ఓ అతిథి గృహంలో కేక్ కట్ చేసి, నిబంధనలను ఉల్లంఘిస్తూ మరోసారి వీడియోలు, పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం వివాదాస్పదమైంది. బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకంగా తిరుమల తీసుకువచ్చిన మాధురి.. తమతో పాటు వీఐపీ ప్రోటోకాల్ దర్శనం కల్పించారు. అయితే ముందు రోజు రాత్రి అతిథి గృహంలో కేక్ కట్ చేశారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో కేకులపై నిషేధం ఉంది. తాము బస చేసిన అతిథిగృహంలో వేడుకలు చేయటమే కాకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ కూడా చేసారు. దివ్వెల మాధురి తన స్నేహానికి గుర్తుగా బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామికి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించింది. శ్రీవారి సన్నిధిలో కేక్‌లపై నిషేధం ఉన్నప్పటికీ తనూజాతో కేక్ కట్ చేయించారు. పవిత్ర పుణ్య క్షేత్రంలో పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా దివ్వెల మాధురి నిబంధనలు ఉల్లంఘించారు. టీటీడీ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినా.. మళ్లీ అలాంటి పని చేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమల వచ్చే సెలబ్రెటీలు నిబంధనలు ఉల్లంఘించడం సర్వ సాధారణమైంది. ఓ యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రసాదం పంపిణీని “కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం.. రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే” అని వ్యాఖ్యానించారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ భక్తులు తీవ్ర విమర్శలు చేయడంతో శివజ్యోతి క్షమాపణలు కోరారు. ఇక ఇటీవలే మరో యూట్యూబర్ గీతూ రాయల్ ఓ సినిమా పాటకు తిరుమల ఘాట్ రోడ్‌లో కొండ మీద డ్యాన్స్ చేసి ఆ వీడియోను అప్ లోడ్ చేశారు. వరుసగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా కూడా టీటీడీ విజిలెన్స్ విభాగం చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

