Tuesday, August 4, 2026 06:52 PM
Tuesday, August 4, 2026 06:52 PM

మరో వివాదంలో మోహన్ బాబు యూనివర్సిటీ..!

గత రెండు మూడేళ్ళ నుంచి సినీ నటుడు మోహన్ బాబు యునివర్సిటీ ఏదోక వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. ఇటీవల విద్యార్ధి నాయకుల కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో మోహన్ బాబుకు హైకోర్ట్ కూడా షాక్ ఇచ్చింది. విద్యార్ధి నాయకుల కిడ్నాప్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఫీజులను భారీగా వసూలు చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అలాగే ఉత్తరాది వ్యక్తుల డామినేషన్ కూడా ఇక్కడ పెరిగింది అనే విమర్శలు ఉన్నాయి.

Also Read : పాపం వైసీపీ.. అప్పుడు.. ఇప్పుడు ధర్నాలే..!

తాజాగా మరో ఘటన వివాదాస్పదంగా మారింది. తిరుప‌తిలోని మోహన్ బాబు కాలేజ్‌లో డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న రాత్రి హాస్టల్‌ లో ఫ్యాన్‌ కి ఉరివేసుకుంది విద్యార్థిని భువన. అయితే తల్లిదండ్రులకు కాలేజ్ యాజమాన్యం ఆలస్యంగా సమాచారం ఇవ్వడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనితో.. మోహన్ బాబు కాలేజ్ వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు.

Also Read : పెద్దల సభ బరిలో బీఆర్ఎస్.. గేమ్ ప్లాన్..!

ప్రస్తుతం విద్యార్ధి మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. చంద్రగిరి మండలం, రంగంపేటలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతురాలు పుంగనూరు నియోజకవర్గంలోని మంగళం కు చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. మోహన్ బాబు యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నట్లు తేల్చారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఏంటీ అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్