Friday, June 19, 2026 09:46 AM
Friday, June 19, 2026 09:46 AM

తిరుమల పవిత్రతకు ప్రత్యేక చట్టం: బాబు సంచలన నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిరక్షణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయం తరహాలో టీటీడీకి ప్రత్యేక చట్టం తీసుకురావాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం గంభీరంగా ఆలోచిస్తోంది. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన చాంబర్‌లో మంత్రులతో సమావేశమై ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం, పరకామణిలో జరిగిన దొంగతనం, అలాగే ఆలయ విశిష్టతకు భంగం కలిగించే అంశాలపై సీఎం ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Also Read : ఆఫ్ ది రికార్డు వార్తలు.. పార్ట్ 3..!

ప్రస్తుతం టీటీడీ ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తితో నడుస్తున్నప్పటికీ, రాజకీయ జోక్యం పెరగడం వల్ల పరిపాలనలో లోపాలు చోటుచేసుకుంటున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ప్రసాద తయారీలో రసాయనాలతో తయారు చేసిన నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలను సీఎం తీవ్రంగా పరిగణించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వ కాలంలో పరకామణిలో చోరీ జరగడం, నిందితుడితో రాజీ జరిగిందన్న విషయాలను కూడా ప్రభుత్వం ఉదాహరణగా ప్రస్తావిస్తోంది. ఈ పరిణామాలు తిరుమల పవిత్రతకు ముప్పుగా మారాయని అధికార వర్గాలు అంటున్నాయి.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి ప్రత్యేక చట్టమే పరిష్కారమని సీఎం అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అమృతసర్ స్వర్ణ దేవాలయానికి అమలులో ఉన్న చట్టాన్ని అధ్యయనం చేసి, అదే నమూనాలో టీటీడీకి చట్టం రూపొందించాలన్న దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ ప్రతిపాదనపై మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం దేవాదాయ శాఖను సంబంధిత చట్టంపై సమగ్ర అధ్యయనం చేయాలని కోరినట్లు సమాచారం. మంగళవారం అసెంబ్లీలో ఈ అంశంపై విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది.

Also Read : భారత్ వచ్చేయండి.. స్టూడెంట్స్, టూరిస్ట్ లకు కేంద్రం వార్నింగ్..!

ప్రతిపాదిత చట్టం ద్వారా తిరుమలలో అన్యమతస్తుల నియామకాలను పరిమితం చేయడం, దర్శనానికి వచ్చే ఇతర మతాల వారికి తప్పనిసరి డిక్లరేషన్ విధించడం వంటి అంశాలు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందించాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. లడ్డూ కల్తీ అంశంపై జరగాల్సిన చర్చ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అస్వస్థత కారణంగా వాయిదా పడింది. ఆయనతో పాటు బీజేపీ సభ్యులు కూడా పాల్గొనేలా చర్చను మంగళవారానికి మార్చిన ప్రభుత్వం, సుమారు నాలుగు గంటల పాటు టీటీడీ అంశంపైనే చర్చకు సమయం కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో...

భయపడాల్సిన వారేమో భయపెడుతున్నారు.. భయపెట్టాల్సిన వారేమో...

పోల్స్