Tuesday, August 4, 2026 04:40 PM
Tuesday, August 4, 2026 04:40 PM

చెప్తే అర్ధం కాదా..? ఎమ్మెలపై పవన్ సీరియస్..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల విషయంలో కూటమి పెద్దలు సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. పదే పదే సమావేశాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేసినా సరే కొంతమంది ఎమ్మెల్యేల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. సమావేశాలకు హాజరయ్యే విషయంలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా హాజరు విధానాన్ని ప్రవేశపెట్టిన సరే, కొంతమంది ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకోవడం లేదని విమర్శలు వినపడుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల విషయంలో బీఏసీ సమావేశం సమయంలోనే కొందరు ఎమ్మెల్యేలను హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Also Read : అనంతబాబును కాపాడుతున్నది ఎవరూ..?

అయితే జనసేన పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పదే పదే అసెంబ్లీ సమావేశాలను లెక్కచేయడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడకపోవడమే కాకుండా ఏదైనా సమస్య ఉంటే కనీసం మంత్రులను కలిసి.. పరిష్కారాలు చూపాలని కూడా ఎమ్మెల్యేలు అడగటం లేదని పవన్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. మంత్రులు అసెంబ్లీలో ఉన్న సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు సచివాలయంలో తిరుగుతున్నారని కూడా పవన్ కళ్యాణ్ కు సమాచారం అందింది.

Also Read : టీమిండియా అప్‌డేట్‌.. ఫైనల్ టీమ్‌లోకి శాంసన్..!

కనీసం సభ నుంచి బయటకు వెళ్లిపోయే సమయంలో జనసేన మంత్రులకు, కూడా ఎమ్మెల్యేలు సమాచారం ఇవ్వటం లేదని పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశాలకు రావడం కష్టంగా ఉంటే తనకు చెప్పాలని.. కనీసం గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి తనను సంప్రదించడం లేదని పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైన పట్టే తమ నియోజకవర్గాలకు.. నిధులు అడగటం లేదని ఎమ్మెల్యేల విషయంలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారట. సమావేశాలకు రావడం ఇష్టం లేకపోతే జీతం కూడా తీసుకోవద్దని నేరుగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

రోడ్డు ప్రమాదాలపై కేంద్రం...

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఘోర రోడ్డు...

పోల్స్