Saturday, May 23, 2026 02:03 PM
Saturday, May 23, 2026 02:03 PM

టీమిండియా అప్‌డేట్‌.. ఫైనల్ టీమ్‌లోకి శాంసన్..!

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టోర్నీ కీలక దశకు చేరుకుంది. లీగ్ దశలో 4 గ్రూపులలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న 8 జట్లు సూపర్ 8 దశకు చేరుకున్నాయి. సూపర్ 8 గ్రూప్ వన్‌లో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ఉన్నాయి. గ్రూప్ టూలో ఇంగ్లండ్, న్యూజీలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు ఉన్నాయి. సూపర్ 8 తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ – న్యూజీలాండ్ తలపడనుండగా.. టీమిండియా తన తొలి మ్యాచ్ సౌతాఫ్రికాతో ఆడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రెండు జట్లు ఇప్పటికే విస్తృతంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆడే తుది జట్టు ఏదీ అనే అంశం ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Also Read : ఆఫ్ ది రికార్డు వార్తలు.. పార్ట్ 2..!

టీమిండియాను ఇప్పుడు బాగా ఇబ్బంది పెడుతున్న అంశం ఓపెనర్ అభిషేక్ శర్మ. వరుసగా 3 మ్యాచ్‌లలో డకౌట్ అయ్యాడు. అమెరికాతో ఆడిన తొలి మ్యాచ్‌లో మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. నమీబియా జరిగిన మ్యాచ్‌కు అభిషేక్ దూరంగా ఉన్నారు. ఆ తర్వాత పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అభిషేక్ సున్నా పరుగులకే పెవిలియన్ చేరాడు. లీగ్‌లో చివరి మ్యాచ్‌ నెదర్లాండ్స్‌తో భారత్ తలపడింది. ఆ మ్యాచ్‌లో కూడా అభిషేక్ స్కోర్ సున్నా. భారీ షాట్‌కు ప్రయత్నించడం క్యాచ్ ఇచ్చి అవుటవ్వడం.. నెదర్లాండ్స్ మీద అయితే క్లీన్ బౌల్డ్. దీంతో అభిషేక్ ఆటపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అభిషేక్‌ను తప్పిస్తారనే టాక్ బాగా వినిపిస్తోంది.

Also Read : అనంతబాబును కాపాడుతున్నది ఎవరూ..?

ఈ నేపథ్యంలోనే మరో ఓపెనర్ సంజూ శాంసన్ నెట్స్‌లో గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తున్న విషయం హాట్ టాపిక్‌గా మారింది. సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో సంజూ ఓపెనింగ్ ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది. అలాగే తిలక్ వర్మకు విశ్రాంతి ఇస్తారని తెలుస్తోంది. వాషింగ్టన్ సుందర్‌ను పక్కన పెట్టి అక్సర్ పటేల్‌కు తుది జట్టులో స్థానం కల్పించనున్నట్లు సమాచారం. కుల్‌దీప్ యాదవ్ బదులుగా మరోసారి అర్షదీప్‌ సింగ్‌ ను కొనసాగిస్తారని తెలుస్తోంది. మొత్తానికి అభిషేక్ శర్మ స్థానంలో సంజూ ఖాయమని.. ఈ మ్యాచ్‌లో సంజూ నిలకడగా రాణిస్తే.. మిగిలిన మ్యాచ్‌ల్లో కొనసాగటం ఖాయంగా తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: ఇద్దరు ఎమ్మెల్యేలకు...

జనసేన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల...

ట్రంప్ పిచ్చి తట్టుకోలేకే...

అమెరికా రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం...

చంద్రబాబుతో ఏపీ బిజేపి...

ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి....

ఇన్స్టంట్ ఫ్రెండ్ వర్సెస్...

ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఏపీలో...

మందుబాబులకు సర్కార్ షాక్..!

మందుబాబులకు భారీ షాక్ తగిలే సూచనలు...

కాక్రోచ్ జనతా పార్టీ...

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా...

పోల్స్