Wednesday, February 4, 2026 06:38 AM
Wednesday, February 4, 2026 06:38 AM

వారణాసి డేట్ ఫిక్స్..!

వారణాసి.. భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం. అయితే ఇప్పుడు ఇదే పేరుతో పాన్ వరల్డ్ సినిమా తీస్తున్నారు దిగ్గజ దర్శకులు రాజమౌళి. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రిన్స్ మహేష్ బాబు డ్యుయల్ రోల్ చేస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృద్వీరాజ్ సుకుమారన్ మెయిన్ రోల్ చేస్తున్నారు. భారతీయ సంస్కృతికి క్లాసిక్ అడ్వెంచర్‌గా ఈ సినిమా రాబోతోంది. నిజానికి ఈ సినిమా పేపర్ వర్క్ 2010 లోనే మొదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాతే ఈ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాను దాదాపు 150 మిలియన్ డాలర్లు.. అంటే సుమారు 13 వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

Also Read : దేవర 2.. కొరటాల దిమ్మ తిరిగే ప్లానింగ్

వారణాసి టైటిల్ రివీల్, గ్లిమ్స్ ఈవెంట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుక తర్వాత సినిమా అంచనాలు మరింత పెరిగిపోయాయి. మహేష్‌ను రాజమౌళి కొత్తగా చూపిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అలాగే నెగిటివ్ రోల్‌లో పృద్వీరాజ్ సుకుమారన్ గెటప్ కూడా ఓ రేంజ్‌లో ఉందనే మాట వినిపిస్తోంది. భారతీయ సినీ చరిత్రలో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ సినిమాగా తెరకెక్కుతోంది. ఐ మ్యాక్స్ ఫార్మెట్‌లో వస్తున్న తొలి భారతీయ సినిమా వారణాసి కావడం మరో విశేషం. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. పీ.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫర్‌గా ఉన్నారు. విజువల్ ఎఫెక్ట్ వి.శ్రీనివాస్ మోహన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.

టైటిల్ రివీల్ రోజునే సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే 2027లో అని రాజమౌళి జవాబిచ్చారు తప్ప.. తేదీ మాత్రం చెప్పలేదు. అయితే ఇప్పటికే ఈ సినిమాపై రకరకాల తేదీలు ప్రచారంలో ఉన్నాయి. వారణాసి అనేది పౌరణికానికి సంబంధించిన కథ కావడంతో.. అంతా శ్రీరామనవమి రోజున విడుదల చేస్తారని అంతా భావించారు. అయితే తాజాగా 2027 ఏప్రిల్ 7వ తేదీ సినిమా వస్తుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి. వారణాసిలో “ఇన్ థియేటర్.. 7 ఏప్రిల్, 2027” అనే ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. అసలు ఇది ఏ సినిమా గురించి అనే చర్చ కూడా జరుగుతోంది.

Also Read : నోటీసులు.. కొడుకు అలా.. కుమార్తె ఇలా..!

నిజానికి ఏప్రిల్ 7వ తేదీ ఉగాది పండుగ. తెలుగు వారి కొత్త ఏడాది ప్రారంభం. ఆ తర్వాత 15వ తేదీన శ్రీరామనవమి పండుగ. ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 7వ తేదీన మరాఠీలకు ఎంతో ముఖ్యమైన గుడిపడ్వా. దీంతో వరుస సెలవులు. ఈ వారం రోజుల్లోనే సినిమాకు 12 వందల నుంచి 13 వందల కోట్ల వరకు కలెక్షన్ వస్తుందని చిత్ర దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఆ తర్వాత నుంచి వేసవి సెలవులు కావడంతో.. ఈ సినిమా సులువుగా 2 వేల కోట్ల మార్క్ దాటుతుందని సినీ పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. అందుకే జక్కన్న ఏప్రిల్ 7వ తేదీ 2027న రిలీజ్ చేయాలని భావిస్తున్నారనే మాట వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్