Wednesday, May 6, 2026 10:48 PM
Wednesday, May 6, 2026 10:48 PM

బోయపాటి బాలీవుడ్ లాంచ్.. ఖాయమేనా?

కమర్షియల్ సినిమాలతో దాదాపు రెండు దశాబ్దాల నుంచి టాలీవుడ్ లో సందడి చేస్తున్న సీనియర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ చేసారు. అఖండ సినిమా తర్వాతి నుంచి బాలీవుడ్ కు దగ్గరైన బోయపాటి.. అఖండ సీక్వెల్ తో మరోసారి నార్త్ ఆడియన్స్ కు ఏం కావాలో అది ఇచ్చే ప్రయత్నం చేసారు. ప్రస్తుతం బోయపాటి ఖాళీగా ఉన్నాడు. మరి తర్వాతి ప్రాజెక్ట్ ఏంటీ అనేది క్లారిటీ లేని పరిస్థితి. అల్లు అర్జున్, రవి తేజ వంటి వాళ్లకు స్టోరీ చెప్పినా వాళ్ళు బిజీగా ఉండటంతో సినిమాలు ఇప్పట్లో కష్టమే.

Also Read : సింఘాల్‌ అవుట్.. టీటీడీ కొత్త ఈవో ఆయనేనా..?

అందుకే ఇప్పుడు ముంబైలో ట్రయల్ వేసినట్టు టాక్. తనకు బాగా పరిచయం ఉన్న ఓ సినీ ప్రముఖుడితో కలిసి.. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను కలిసినట్టు టాక్. పాన్ ఇండియా లెవెల్ స్టోరీ రెడీ చేసుకుని రణవీర్ సింగ్ తో మీటింగ్ పెట్టాడని, కానీ స్టోరీలో సౌత్ ఫ్లేవర్ కాస్త ఎక్కువైందని రణవీర్ చెప్పడంతో.. అది తగ్గించి.. రణవీర్ ను ఇంప్రెస్ చేసేందుకు కష్టపడుతున్నాడని టాక్ నడుస్తోంది. ఓ బాలీవుడ్ మాజీ డైరెక్టర్ తో కలిసి స్టోరీ బిల్డ్ చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Also Read : పెద్దల సభకు లోకేష్ ఆప్తుడు..!

నార్త్ లో సౌత్ సినిమాకు డిమాండ్ పెరగడంతో అక్కడి యాక్టర్స్ కూడా ఇక్కడి మేకర్స్ కు కనెక్ట్ అవుతున్నారు. దీన్ని వాడుకోవాలని ట్రయల్స్ చేస్తున్న బోయపాటి.. రణవీర్ ను ఎలాగైనా ఒప్పించాలని ప్లాన్ చేస్తున్నాడు. మొన్నామధ్య ప్రశాంత్ వర్మ చెప్పిన స్టోరీకి ఫిదా అయిన రణవీర్.. తెలుగు గడ్డపై కుడికాలు పెట్టేందుకు రెడీ అయినా.. ప్రశాంత్ తో గ్యాప్ రావడంతో డ్రాప్ అయిపోయాడు. ఇప్పుడు మంచి స్టోరీలు ఉంటే మాత్రం సినిమా చేసేందుకు రెడీగా ఉన్నట్టు టాక్ నడుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్