Thursday, May 7, 2026 02:10 AM
Thursday, May 7, 2026 02:10 AM

దేవర 2.. కొరటాల దిమ్మ తిరిగే ప్లానింగ్

వార్ 2 తో కాస్త డల్ అయిన ఎన్టీఆర్.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న డ్రాగన్ సినిమా కోసం కంప్లీట్ ఎఫర్ట్ పెట్టేసాడు. ఎన్టీఆర్ లుక్స్ కొంత ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతున్నా.. సినిమా కోసమే ఎన్టీఆర్ అలా అయిపోయాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరి దేవర 2 సినిమా సంగతి ఏంటీ అనే దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. దేవర సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ రావడం, క్లైమాక్స్ లో ఇచ్చిన చిన్న ట్విస్ట్ తో పార్ట్ 2 విషయంలో మాత్రం ఆసక్తి పెరిగింది. షూట్ ఎప్పుడా అనే దానిపై రూమర్స్ వచ్చాయి.

Also Read : మద్యం వద్దంటున్న జెన్ జీ.. కారణం ఏంటీ..?

అయితే లేటెస్ట్ గా నిర్మాత మిక్కిలినేని సుధాకర్ కామెంట్స్ తో ఈ సినిమా షూట్ ఈ సమ్మర్ నుంచి శురూ అయి.. వచ్చే ఏడాదికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిసింది. దీనితో డైరెక్టర్ కొరటాల.. పార్ట్ 2 స్క్రిప్ట్ పై గట్టిగానే వర్క్ చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు ఎన్టీఆర్ చెప్తున్నట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో కొన్ని స్పెషల్ సీన్స్ కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఫస్ట్ పార్ట్ లో జరిగిన తప్పులు సెకండ్ పార్ట్ లో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

Also Read : మెగాస్టార్‌తో ఢీ అంటున్న సింగర్

హైప్ పెద్దగా లేకపోవడంతో గెస్ట్ రోల్స్ విషయంలో కూడా వర్కౌట్ చేస్తున్నారు. బడ్జెట్ పెరగకుండా ఉండేలా కూడా వర్క్ స్టార్ట్ చేసినట్టు సమాచారం. కాస్ట్ కటింగ్ చేస్తూనే.. స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్లకు ఆన్ బోర్డ్ చేసే ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో ఓ రోల్ చేయనున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉండటంతో తర్వాత ఈ సినిమాపై ఫోకస్ చేస్తాడు. ఎన్టీఆర్ కొంత బరువు కూడా పెరగాల్సి ఉండటంతో.. రెస్ట్ ఇచ్చే ఛాన్స్ కనపడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్