Thursday, May 7, 2026 12:55 AM
Thursday, May 7, 2026 12:55 AM

తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్..!

చిన్న గీత పక్కన పెద్ద గీత.. తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న మాట ఇదే. నిజమే.. ఒక విషయంపై విమర్శలు మొదలైతే.. దాని నుంచి దృష్టి మళ్లించేందుకు మరో సమస్యను తెరపైకి తీసుకువస్తున్నారు. ఇప్పుడు ఇవే ఆరోపణలు రేవంత్ సర్కార్‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆరోపణలు చేస్తున్నారు తప్ప.. వాటిని రుజువు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలను రేవంత్ సర్కార్ ఎదుర్కొంటోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలను రుజువు చేయకపోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.

Also read : చెవిరెడ్డికి బెయిల్.. ఆయన్ను మాత్రం వదలని హైకోర్ట్..!

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చేందుకు ప్రధాన కారణం.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోయాయి. ఈ విషయం బయటకు రావడంతో.. ఎవ్వరూ అటువైపు వెళ్లకుండా కేసీఆర్ సర్కార్ ఆంక్షలు విధించింది. దీంతో ఇదే నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అస్త్రంగా మారింది. ఇక రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణకు ఆదేశించారు. కానీ రెండేళ్లు దాటినా కూడా.. ఆ కేసు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు.

ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చిన మరో అంశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం. కానీ ఆ విషయాన్ని రుజువు చేయడానికి రేవంత్ సర్కార్‌కు రెండేళ్ల సమయం కూడా సరిపోలేదు. ఇప్పటికీ ఈ కేసులో తాజాగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావును విచారించారు. అయితే ఈ విచారణ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఇందుకు ప్రధాన కారణం.. నైనీ బొగ్గు గనుల కేటాయింపులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై ఆరోపణలు. వీటి నుంచి దృష్టి మళ్లీంచేందుకే రెండు రోజుల వ్యవధిలో హరీష్, కేటీఆర్, సంతోష్ రావులను విచారణకు సిట్ నోటీసులు ఇచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also read : మాట జాగ్రత్త.. మంత్రులకు సిఎం వార్నింగ్

కాళేశ్వరం ప్రాజెక్టు కేసు విచారణ ఏమైంది అనే ప్రశ్నకు కాంగ్రెస్ నేతల వద్ద సమాధానం లేదు. ఇక హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసు‌లో ఏసీబీ అధికారులు కేసులు కూడా నమోదు చేశారు. కానీ ఇప్పుడు ఆ కేసు ఏమైందో తెలియటం లేదు. తాజాగా గ్రీన్ కో సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో సమావేశమయ్యారు. ఈ -కార్ రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్ కో సంస్థ ప్రతినిధులతో భేటీ వెనుక మర్మం ఏమిటనేది ఇప్పటికీ అర్థం కాలేదు. ఇక ఈ – కార్ రేస్ కేసులో విజిలెన్స్ కమిషన్‌కు ఏసీబీ నివేదిక చేరిన తర్వాత కేసు దర్యాప్తు అంగుళం కూడా ముందుకు జరగలేదు. ఈ కేసులో కూడా కేటీఆర్‌ను విచారించారు.

తాజాగా తెలంగాణాలో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మధ్య సీనియర్, జూనియర్ వార్ నడుస్తోంది. అందుకు రేవంత్ మనిషిగా ముద్రపడిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా భట్టి తన మిత్రుడైన నరేంద్ర చౌదరికి చెందిన ఎన్ టీవీలో వార్తలు ప్రసారం చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక నైనీ కోల్ మైన్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతుండటంతో.. ఆ వ్యవహారం నుంచి దృష్టి మరల్చేందుకే ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఓ వైపు మేడారం జాతర జరుగుతున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వటం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదంతా ప్రజల దృష్టి మళ్లించేందుకే అనే మాట ఇప్పుడు తెలంగాణలో బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్