Thursday, May 7, 2026 07:02 AM
Thursday, May 7, 2026 07:02 AM

బంగ్లా జట్టుకు ఎన్ని కోట్ల నష్టమంటే..?

2026లో జరిగే టీ20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ భారత్‌కు వెళ్లబోమని స్పష్టం చేసిన నేపధ్యంలో పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. స్కాట్లాండ్ ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం కనపడుతోంది. ‘భద్రతాపరమైన సమస్యలు’ కారణంగా తమ మ్యాచ్‌లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని కోరినా ఫలితం లేకుండా పోయింది. అయితే, ప్రపంచ కప్ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులు చేయబోమని, బంగ్లాదేశ్ వైఖరి వారు పోటీలో లేకపోతే మరో జట్టుతో ఆ స్థానాన్ని భర్తీ చేస్తామని పేర్కొంది.

Also Read : జనసేనాని స్పీడ్.. అరకులో ఇల్లు కడతారా..?

అయితే టీ20 ప్రపంచ కప్‌ నుంచి తప్పుకోవడం కారణంగా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కి భారీ ఆర్థిక నష్టంగా చెప్తున్నాయి క్రికెట్ వర్గాలు. కొన్ని నివేదికల ప్రకారం, అది వారి వార్షిక ఆదాయంలో దాదాపు 60 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ కప్‌లో ఆడకపోతే 27 మిలియన్ డాలర్లు లేదా రూ.240 కోట్లు నష్టపోతుంది. ఈ నిర్ణయం వల్ల ప్రసార ఆదాయం, స్పాన్సర్‌షిప్ ఆదాయం, ఆటగాళ్ళ ఫీజులు, ప్రైజ్ మనీ సహా పలు ఆదాయాలు కోల్పోయే అవకాశాలు కనపడుతున్నాయి.

Also Read : వైసీపీలో పాదయాత్ర ప్రకంపనలు..!

ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమయ్యే టోర్నమెంట్ లో జట్టు ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ తదుపరి స్థానంలో ఉండటంతో వారికి అవకాశం కల్పించారు. అయితే, బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్, జాతీయ జట్టు ఆటగాళ్లతో సమావేశం తర్వాత, ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే క్రికెట్ స్కాట్లాండ్ సీఈఓ ట్రూడీ లిండ్‌బ్లేడ్ టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో ఐసీసీ ఆ విషయాన్ని ఆ సంస్థకు తెలియజేసిందా లేదా అనే దానిపై మాత్రం స్పష్టత లేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్