Sunday, June 21, 2026 10:53 AM
Sunday, June 21, 2026 10:53 AM

ఐటీ రంగంలో కుదుపు.. మరో 17 వేల ఉద్యోగాలు హుష్..!

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పలు కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించడం ఆందోళన కలిగిస్తోన్న అంశంగా చెప్పుకోవచ్చు. ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు తాజాగా మరో కంపెనీ కూడా ఈ దిశగా అడుగులు వేయడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. వచ్చే వారంలో అమెజాన్ భారీగా ఉద్యోగులను తొలగించే అవకాశం కనపడుతోంది. జనవరి 27న సంస్థ తీసుకునే నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Also Read : చంద్రబాబును తప్పుదోవ పట్టిస్తున్నారా..?

కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఉద్యోగులలో ఆందోళన వ్యక్తమవుతోంది. రెండవ దశ ఉద్యోగుల కోతలకు రంగం సిద్దం చేసారు. అక్టోబర్‌లో, అమెజాన్ పలు దశల్లో దాదాపు 30,000 ఉద్యోగాలను తొలగించాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. మొదటి రౌండ్‌లో దాదాపు 14,000 ఉద్యోగాలను తొలగించాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్గతంగా వస్తున్న వార్తలతో.. 16,000 ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి అనే చర్చ మొదలైంది.

Also Read : కేటిఆర్ విచారణ వెనుక కవిత.. బీఆర్ఎస్ సంచలన ఆరోపణ..!

2023లో 27,000 ఉద్యోగాలను అమెజాన్ తొలగించింది. 1,000 నుండి 2,000 మంది అమెజాన్ ఉద్యోగులు ఇప్పటికే నోటీసులు అందుకున్నారని సమాచారం. చట్ట ప్రకారం ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా సంస్థ చర్యలు చేపడుతోంది. ప్రభావిత ఉద్యోగుల వాస్తవ సంఖ్య గణనీయంగా భారీగా ఉండే అవకాశం ఉంది. గతంలో ఆపరేషనల్ రోల్స్ ను టార్గెట్ చేసిన సంస్థ.. ఎక్కువ జీతాలు ఉన్న ఉద్యోగులపై ఫోకస్ చేసింది. అమెజాన్ పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ (PXT) విభాగం, దాని అంతర్గత హెచ్ ఆర్ విభాగంలో ఉద్యోగాలు తొలగిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్