Saturday, September 19, 2026 10:22 PM
Saturday, September 19, 2026 10:22 PM

నెయ్యి కల్తీనే.. సిబిఐ సంచలన విషయాలు..!

తిరుమలలో కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఏడాది కాలంగా ఆందోళన వ్యక్తమవుతోంది. తిరుమల శ్రీవారి లడ్డులో జరిగిన అక్రమాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నెయ్యిని కల్తీ చేయడమే కాకుండా అందులో జంతువుల కొవ్వు కూడా వాడారు అనే ఆరోపణలు వచ్చాయి. దీనితో ఈ వ్యవహారాన్ని ఏపీ సర్కార్ సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్ళింది. కీలక వ్యక్తులను అరెస్ట్ లు చేసి సిట్ అధికారులు విచారించారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధీనంలో ఈ వ్యవహారం జరిగిందనే ఆరోపణ వచ్చింది.

Also Read : ఐటీ రంగంలో కుదుపు.. మరో 17 వేల ఉద్యోగాలు హుష్..!

ఆయన పిఏ.. చిన్న అప్పన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నెయ్యి తయారి సంస్థల అధినేతలను కూడా విచారించి అసలు విషయాలను బయటకు తీసారు. ఇక తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల కల్తీ నెయ్యి కేసుపై నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ.. సంచలన విషయాలను ప్రస్తావించింది. 36 మందిని నిందితులుగా చేర్చింది సీబీఐ సిట్. నిందితుల్లో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు.

Also Read : కేటిఆర్ విచారణ వెనుక కవిత.. బీఆర్ఎస్ సంచలన ఆరోపణ..!

12 మందిలో వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న కూడా ఉన్నారు. ఎవరెవరికి కమీషన్లు ఇచ్చారనే లావాదేవీల వివరాలు సేకరించిన సీబీఐ సిట్.. వారి పేర్లను కూడా పొందుపరిచింది. 2019-24 మధ్య లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారు అని గుర్తించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో బోలేబాబా డెయిరీ కీలకపాత్ర పోషించినట్లు తేల్చారు. పాలు, నెయ్యి లేకపోయినా నెయ్యి నాణ్యత బాగుందని గతంలో టీటీడీ అధికారులు నివేదిక ఇవ్వడం గమనార్హం. గతంలో తిరుమలకు వచ్చిన నెయ్యి నాణ్యతను నిర్ధారణ చేయలేదని, కల్తీ నెయ్యి వాడకంతో శ్రీవారి లడ్డు నాణ్యత దెబ్బతిందని తెలిపింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్