Saturday, September 19, 2026 10:19 PM
Saturday, September 19, 2026 10:19 PM

జనసేనాని స్పీడ్.. అరకులో ఇల్లు కడతారా..?

2014 లో సొంతగా పార్టీ ఏర్పాటు చేసి.. రాజకీయాల్లో యుద్ధం మొదలుపెట్టిన జనసేనాని, ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్.. పదేళ్ళ తర్వాత అధికారం రుచి చూస్తున్నారు. పాతికేళ్ళ రాజకీయ లక్ష్యం పేరుతో జెండా ఎగురవేసి.. పదేళ్ళకు పొత్తుతో అధికారంలో భాగం అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జనసేనాని రాజకీయ అడుగులు కనపడుతున్నాయి. ఓ వైపు పాలన, మరో వైపు పార్టీ అంటూ హడావుడిగా గడుపుతున్నారు. సినిమాలను కూడా పవన్ లైట్ తీసుకున్నట్టే కనపడుతోంది.

Also Read : సాయిరెడ్డి రాజకీయ ప్రయాణం అటేనా..?

ఇక ఇప్పుడు పవన్ ఏం చేస్తారు..? ఏయే నియోజకవర్గాలపై ఫోకస్ చేస్తారు..? వచ్చే ఎన్నికలకు ఎలా సిద్దం కాబోతున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పార్టీని బలోపేతం చేసే క్రమంలో, పవన్ కళ్యాణ్ తనకు పట్టున్న గోదావరి జిల్లాలపై గురిపెట్టారు. పిఠాపురం భుజాలపై తుపాకి పెట్టి, గోదావరి జిల్లాలను గురిపెట్టారు పవన్. ఇక అక్కడి నుంచి ఉత్తరాంధ్ర లక్ష్యంగా పవన్ అడుగులు పడుతున్నాయి. కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండే ఈ 5 ఉమ్మడి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసే ఆలోచనలో పవన్ కనపడుతున్నారు.

ఈ జిల్లాల్లోనే మెజారిటీ సీట్లు తీసుకుని, కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటి మీద నడిపే విధంగా పవన్ ప్లాన్ చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కనీసం 52 స్థానాల్లో పవన్ పోటీ చేసే యోచనలో కనపడుతున్నారు. అందుకే ఉత్తరాంధ్రలో ఈ మధ్య కాలంలో అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ శ్రీకారం చుడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల లక్ష్యంగా పంచాయితీ రాజ్ శాఖ అడుగులు పడుతున్నాయి. మారుమూల గ్రామాల్లో ఇక్కడ వైసీపీకి పట్టు ఎక్కువ.

Also Read : తెలంగాణలో ఫిబ్రవరి నుంచే ఎన్డీయే వార్ షురూ..?

అందుకే అక్కడ గురి పెట్టి కొడితే.. అరకు, అనకాపల్లి, విశాఖ, విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న గిరిజన గ్రామాలను వైసీపీ నుంచి దూరం చేయవచ్చు అనే లక్ష్యంలో పవన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే అరకులో పవన్ ఓ ఇల్లు కూడా కట్టుకునే యోచనలో ఉన్నట్టు.. ఉత్తరాంధ్రలో చర్చ మొదలైంది. ఈ 5 జిల్లాల్లోనే మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు పవన్ తీసుకునే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ టీడీపీ నాయకత్వం కూడా కొంత బలహీనంగా ఉండటం.. వైసీపీ గానీ, టీడీపీ గానీ ఇక్కడ అధిష్టానాల నాయకులకే బలం ఉండటంతో ఆ స్పేస్ ను తాను వాడుకునే యోచనలో ఉన్నట్టు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్