Sunday, September 20, 2026 08:07 AM
Sunday, September 20, 2026 08:07 AM

బ్రేకింగ్: వీసా ఫీజులు మళ్ళీ పెంచేసిన ట్రంప్..!

ఒకప్పుడు అమెరికాలో ఉద్యోగం చేయాలి అనుకునే వారికి హెచ్ 1 బీ వీసాలు బెస్ట్ ఆప్షన్ గా ఉండేవి. కానీ డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితి మారిపోయింది. అమెరికా వీసాలు అంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మార్చి 1 నుంచి అమలులోకి వచ్చే హెచ్-1బీ వీసా రూల్స్ తో అనేక ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కొరకు ప్రీమియం ప్రాసెసింగ్ రుసుములను పెంచుతున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది.

Also Read : వెనిజులా చమురు భారత్ కు..? అమెరికా సంచలన నిర్ణయం..!

జూన్ 2023 నుండి జూన్ 2025 వరకు ద్రవ్యోల్బణం నేపథ్యంలో.. ప్రీమియం ప్రాసెసింగ్ రుసుమును పెంచినట్లు తెలిపింది. ఈ మార్పులు అమెరికాలో పనిచేస్తున్న లేదా చదువుతున్న భారత పౌరులతో సహా విదేశీ నిపుణులు విస్తృతంగా ఉపయోగించే వారిపై ప్రభావం పడనుంది. సవరించిన ఫీజు షెడ్యూల్ ప్రకారం, హెచ్-2బీ లేదా ఆ -1 వలసేతర స్టేటస్ కోసం ఫారమ్ ఐ-129 పిటిషన్ల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 1,685 నుండి 1,780 డాలర్లకు పెరగనుంది.

Also Read : భారత్ కు భయపడుతోన్న బంగ్లా ఆటగాళ్ళు..?

పెరిగిన ఆదాయాన్ని ఏజెన్సీలలో సేవలు మెరుగుపరిచేందుకు వినియోగిస్తామని తెలిపింది. హెచ్ -1బీ , ఎల్ -1, ఓ -1, పీ -1 మరియు టియెన్ వీసాలతో సహా అందుబాటులో ఉన్న అన్ని ఇతర ఫారమ్ ఐ-129 వీసాలకు ప్రీమియం ప్రాసెసింగ్ 2,805 నుండి 2,965 డాలర్లకు పెరుగుతుంది. ఉపాధి ఆధారిత వర్గాలలోని విదేశీ కార్మికుల కోసం ఫారమ్ ఐ-140 పిటిషన్లకు అదే 2,965 డాలర్ల ప్రీమియం ప్రాసెసింగ్ రుసుము వర్తిస్తుంది. గతంలో ఇది 2,805 డాలర్లుగా ఉండేది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్