Sunday, September 20, 2026 07:22 AM
Sunday, September 20, 2026 07:22 AM

వెనిజులా చమురు భారత్ కు..? అమెరికా సంచలన నిర్ణయం..!

ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భారత్ పై అమెరికా క్రమంగా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో మరో కీలక అడుగు పడే సంకేతాలు కనపడుతున్నాయి. అమెరికా నియంత్రణలో ఉన్న వెనిజులా చమురును విక్రయించడానికి భారత్ కు విక్రయించేందుకు వైట్ హౌస్ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి 3న అమెరికా దళాలు అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసిన తర్వాత.. ఈ వారం 2 బిలియన్ డాలర్ల విలువైన వెనిజులా ముడి చమురును అమెరికాకు ఎగుమతి చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నాయి.

Also Read : భారత్ పై భారీ సుంకాలు.. అమెరికన్ మీడియా సంచలనం..!

అమెరికా ముడి చమురు వ్యాపారంపై ఫోకస్ పెట్టిన నేపధ్యంలో.. ప్రపంచ మార్కెట్ పై దృష్టి సారించింది. వెనిజులా ముడి చమురును.. భారత్ కు విక్రయించేందుకు అమెరికా సిద్దంగా ఉందని.. ట్రంప్ సర్కార్ లో సీనియర్ అధికారి ఒకరు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. వాస్తవానికి అమెరికా ఆంక్షలకు ముందు.. వెనిజులా నుంచి భారత్ ముడి చమురును భారీగా కొనుగోలు చేస్తోంది. భారత్ తో వెనిజులా చమురు వాణిజ్యంపై పరిస్థితుల గురించి అడగగా.. అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్టోఫర్ రైట్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను సీనియర్ అధికారి ప్రస్తావించారు.

Also Read : సీసాలు వాళ్లవే.. స్క్రిప్ట్ వాళ్లదే.. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!

దాదాపు అన్ని దేశాలకు వెనిజులా ముడి చమురు విక్రయించడానికి అమెరికా సిద్దంగా ఉందని పేర్కొన్నారు. వెనిజులా ముడి చమురును అన్ని దేశాలకు అమ్మే విధంగా చర్యలు తీసుకుంటామని.. కానీ అమెరికా సర్కార్ రూపొందించిన, పర్యవేక్షించే నిర్మాణం ద్వారా మాత్రమేనని తెలిపారు. ఆ డబ్బులు అమెరికా తీసుకుని వెనిజులాకు చెల్లిస్తుందని వైట్ హౌస్ అంటుంది. ఆ డబ్బులను వెనిజులా ప్రజలకు ఇస్తామని అమెరికా చెప్పుకొచ్చింది. అవినీతి పాలన కోసం కాదు అంటూ వ్యాఖ్యానించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్