Wednesday, August 5, 2026 04:20 AM
Wednesday, August 5, 2026 04:20 AM

డిప్యూటీ సీఎంగా నారా లోకేష్? వేణు స్వామి అంచనాలు కలకలం

మంత్రి నారా లోకేష్‌కు త్వరలో మరో కీలక పదోన్నతి దక్కనుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో మరోసారి ఊపందుకుంటోంది. ఈ ఏడాదిలోగానే ఆయనకు మంత్రి పదవికి మించి బాధ్యతలు అప్పగించే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాన్ని ముందుగానే అంచనా వేసినట్లు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Also Read : మన శంకర వరప్రసాద్.. సేఫ్ జోన్ కలెక్షన్స్ ఎంతంటే?

సెలబ్రిటీలకు జ్యోతిష్య సూచనలు ఇచ్చే వ్యక్తిగా పేరు తెచ్చుకున్న వేణు స్వామి, గతంలో పలుమార్లు చేసిన అంచనాలు నిజమవడంతో మీడియాలో గుర్తింపు పొందారు. వివాదాలతో సహవాసం కూడా ఆయన్ను మీడియాకు దగ్గర చేసింది అని చెప్పుకోవచ్చు. అయితే రాజకీయ అంశాలపై ఆయన చేసిన కొన్ని జోష్యాలు ఫలించకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పిన జోష్యం తప్పిపోవడం, అంతకుముందు కేసీఆర్ విషయంలోనూ అంచనాలు నిజం కాకపోవడం వల్ల ఆయన తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యారు. దీంతో ఇకపై రాజకీయ జోష్యాలు చెప్పనని స్వయంగా ప్రకటించారు.

అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి మళ్లీ రాజకీయ పరిణామాలపై స్పందించారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్, జగన్, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌ల భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేస్తూ, 2026 లో నారా లోకేష్‌కు తప్పకుండా పదోన్నతి లభిస్తుందని స్పష్టం చేశారు. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశముందని వేణు స్వామి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన మాటలను బట్టి అర్ధం అవుతుంది.

Also Read : మన శంకర వరప్రసాద్.. సేఫ్ జోన్ కలెక్షన్స్ ఎంతంటే?

ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగిస్తారా? లేక టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో సరిపెడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకైక డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. కూటమి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పవన్‌కు చంద్రబాబు నాయుడు తగిన ప్రాధాన్యం కల్పించారు.

ఇలాంటి పరిస్థితుల్లో మరో డిప్యూటీ సీఎం పదవిని సృష్టించి నారా లోకేష్‌కు అవకాశం ఇస్తారా? లేదా పార్టీ పరంగా ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా, నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై అంచనాలు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్