Wednesday, August 5, 2026 03:21 AM
Wednesday, August 5, 2026 03:21 AM

భారత్ కు భయపడుతోన్న బంగ్లా ఆటగాళ్ళు..?

భారత్ – బంగ్లాదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల ప్రభావం క్రికెట్ పై కూడా చూపుతోన్న సంగతి తెలిసిందే. రాజకీయ అంశాలతో కుదేలు అయిన బంగ్లాదేశ్.. ఇప్పుడు అంతర్గత సమస్యలతో ఇబ్బంది పడుతూ హిందువులపై దాడులకు దిగింది. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ దేశంలో ఉన్న హిందువులు ఇప్పుడు బతుకు జీవుడా అంటూ పరుగులు తీసే పరిస్థితి నెలకొంది. ఇదే క్రమంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కఠినంగా వ్యవహరిస్తోంది. ఐపిఎల్ నుంచి ఆ దేశ ఆటగాడిని తప్పించింది.

Also Read : చంద్రబాబు ఫిట్నెస్ కు పెమ్మసాని షాక్.. ఎలా ఇలా..?

కేకేఆర్ ముస్తాఫిజుర్ రహమాన్ ను తప్పించిన సంగతి తెలిసిందే. ఇది క్రమంగా రెండు దేశాల క్రికెట్ యుద్దానికి దారి తీసిన సంగతి తెలిసిందే. 9 కోట్లకు అతనిని కొనుగోలు చేసిన కేకేఆర్ ఆ తర్వాత రిలీజ్ చేసింది. దీనితో భారత్ లో టి20 వరల్డ్ కప్ లో ఆడేది లేదని, మరో దేశంలో టోర్నీ నిర్వహించాలి అని బంగ్లాదేశ్ కోరింది. కానీ ఐసీసీ మాత్రం ఈ విషయంలో అంగీకారం తెలపలేదు. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం బంగ్లా ఫ్యాన్స్ ను వేధిస్తోంది. ఈ అంశంలో పాక్ క్రికెట్ బంగ్లా కు అండగా నిలబడింది.

Also Read : ఏపీలో ఉప ఎన్నికలు ఖాయమా..?

కానీ బంగ్లా ఆటగాళ్ళు మాత్రం ముస్తాఫిజుర్ రహమాన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో గాని ఎలక్ట్రానిక్ మీడియాలో గాని మాట్లాడలేదు. సాధారణంగా భారత్ విషయంలో దూకుడుగా ఉండే ఆటగాళ్ళు దానిని మైదానానికి మాత్రమే పరిమితం చేయడం గమనార్హం. ఇక భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఏ ఆటగాడు కూడా మాట్లాడలేదు. అనవసరంగా విమర్శలు చేస్తే పరిస్థితి దారిలోకి వచ్చిన తర్వాత తమను ఐపిఎల్ కు ఎంపిక చేసే అవకాశం ఉంటే అనవసరంగా ఆదాయం కోల్పోతామనే ఆందోళన కూడా వారిలో ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్