Wednesday, February 4, 2026 10:48 AM
Wednesday, February 4, 2026 10:48 AM

మంత్రుల పేషీలపై జగన్ డేగ కన్ను..?

ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తోన్న మాజీ సిఎం వైఎస్ జగన్ ఇప్పుడు రాజకీయంగా మరింత దూకుడు పెంచి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో మంత్రుల పేషీలపై, ఆఫీసులు, నివాసాలపై వైసీపీ కన్నేసినట్టు తెలుస్తోంది. మంత్రుల పేషీలలో రాజకీయ నాయకుల పెత్తనం సహా పలు అంశాలను తెలుసుకునేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మంత్రుల స్నేహితులు, ఎమ్మెల్యేల స్నేహితులపై సైతం నిఘా పెట్టింది.

Also Read : చంద్రబాబు ఫిట్నెస్ కు పెమ్మసాని షాక్.. ఎలా ఇలా..?

ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు మంత్రుల వ్యక్తిగత వ్యవహారాలూ తెలుసుకునేందుకు.. పని చేసే సిబ్బంది ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. పేషీలకు వచ్చే నియోజకవర్గాల నాయకులు, పేషీల్లో జరిగే కార్యక్రమాలు, సమీక్షా సమావేశాల్లో ఆఫ్ కెమెరా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు రికార్డ్ చేసే ప్రయత్నం కూడా వైసీపీ మొదలుపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లు, మంత్రుల నివాసాలకు వచ్చే వారిపై సైతం వైసీపీ ఫోకస్ పెట్టింది.

Also Read : డిప్యూటీ సీఎంగా నారా లోకేష్? వేణు స్వామి అంచనాలు కలకలం

రహస్యంగా ఫోటోలు తీసేందుకు కూడా కొందరిని నియమించి ఉండవచ్చు అనే చర్చ సైతం మొదలైంది. అలాగే మంత్రులకు, ఎమ్మెల్యేలకు అనుకూలంగా కథనాలు రాసే మీడియా విలేఖర్లు, సోషల్ మీడియా సిబ్బందిపై ఫోకస్ పెట్టింది. సున్నిత సమాచారం తెలుసుకునేందుకు సైతం వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మంత్రులు ఎవరైనా ఇతర ప్రాంతాలకు వెళ్తే.. అక్కడ వారిని ఎవరు కలుస్తున్నారు అనే సమాచారాన్ని కూడా కొందరు అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం సైతం జరుగుతున్నట్టు సమాచారం. గన్ మెన్ లు, పీఎస్ లు, అటెండర్లు, డ్రైవర్లు కాంటాక్ట్ నెంబర్ లు తెలుసుకుని వారి ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేసారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్