Sunday, March 22, 2026 02:20 PM
Sunday, March 22, 2026 02:20 PM

లోకేష్‌కు ఇప్పట్లో ఆ ఆలోచన లేనట్లే..!

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నంత కాలం.. జగన్‌కు “నో ” ఛాన్స్.. కలిసి ఉంటే కలదు సుఖం..ఇది కలిసి వచ్చిన అదృష్టం అనే పాట అందరికీ గుర్తే. ఈ మాట టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చాలా బాగా తెలుసు. అందుకే.. సందర్భం ఏదైనా సరే.. వేదిక ఎక్కడైనా సరే.. తాము ఎప్పటికీ కలిసే ఉంటాం.. విడిపోయే ప్రసక్తే లేదు అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. నిజానికి కూటమి సర్కార్ ఏర్పాటులో ఈ రెండు పార్టీల పొత్తు ప్రధాన పాత్ర పోషించింది. 2014, 2019, 2024 ఎన్నికల ఫలితాలు బేరీజు వేసుకున్న తర్వాతే.. ఈ మాటను ఇరు పార్టీల అధినేతలు చెబుతున్నారు.

Also Read : ఏపీలో ఏం జరుగుతోంది..? ఎమ్మెల్యేలతో పవన్ అత్యవసర సమావేశం..!

కూటమిలో మూడు పార్టీలున్నప్పటికీ టీడీపీ, జనసేన పొత్తు వల్లే అధికారం దక్కిందనేది రాజకీయ విశ్లేషకుల మాట. వారిద్దరు కలిసి ఉన్నంత కాలం, మేము అధికారంలోకి రావటం చాలా చాలా కష్టం అని వైసీపీ నాయకులు చెబుతూనే ఉన్నారు. కూటమి నుంచి బీజేపీ బయటకు వెళితే.. అధి తమకే నష్టమని బీజేపీ నాయకులకు కూడా బాగా తెలుసు. కూటమిలో బీజేపీ ఉన్నా, లేకున్నా సరే.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే.. ఈ కాంబినేషన్‌ను ఎవరూ ఓడించలేరు అనేది విశ్లేషకుల మాట. తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇదే మాట స్పష్టం చేశారు. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలను నిరాశకు గురి చేస్తోంది.

2029 ఎన్నికల్లో గెలుపు మాదే.. వైసీపీ అధికారంలోకి వస్తుంది.. సీఎం జగన్ అంటూ పైకి మాత్రం మాటలు చెబుతున్నారు వైసీపీ అభిమానులు. అటు జగన్ కూడా.. అధికారంలోకి వస్తాం.. అధికారుల బట్టలూడదీస్తాం.. జైలులో పెడతాం.. తగిన మూల్యం చెల్లించుకుంటారు జాగ్రత్త.. అంటూ మాస్ వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. కానీ అంతర్గతంగా వచ్చి సర్వే రిపోర్టులో మాత్రం.. అంత మెరుగైన ఫలితాలు ఉన్నట్లు కనిపించలేదంటున్నారు జగన్ సన్నిహితులు. అందుకే వైసీపీ ఓడిన ఏడాదిన్నర దాటినా కూడా.. ఇప్పటికీ సగం మంది పైగా నేతలు బయట తిరిగేందుకు భయపడుతున్నారు. మరికొందరు పక్క చూపులు చూస్తూనే ఉన్నారు.

Also Read : కలెక్టర్ కు ఫిదా అయిపోయిన చంద్రబాబు..!

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరో 15 ఏళ్ల పాటు తమ పొత్తు కొనసాగుతుందని.. మరో 15 ఏళ్ల పాటు.. అంటూ మరో మూడు విడతల్లో కూడా కూటమి సర్కార్ అధికారంలో ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ స్వయంగా చెబుతున్నారు. ఇవే ఇప్పుడు వైసీపీ నేతలు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న మాటలు. చంద్రబాబు, పవన్ విడిపోయే అవకాశం లేదని.. వాళ్లు కలిసి ఉంటేనే కూటమి గెలుస్తుందని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని పదే పదే చెబుతున్నారు కూడా. ఆ బంధం బ్రేక్ చేయాలనే లక్ష్యంతోనే సోషల్ మీడియాలో పదే పదే కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. అదే సమయంలో త్వరలో లోకేష్ సీఎం అని.. ముహుర్తం ఖరారంటూ పెయిడ్ పోస్టులు పెడుతున్నారనేది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట.

సీఎం కుర్చీ కోసం లోకేష్ తొందర పడుతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం తప్పుడు ప్రచారం చేస్తోందని.. అసలు లోకేష్‌కు అంత అర్జెంట్‌గా సీఎం అవ్వాలనే కోరిక, ఆలోచన లేదని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. లోకేష్ కూడా అన్ని సందర్భాల్లో పవన్ అన్న అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు.. సంభోదిస్తున్నారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు సారధ్యంలోనే కూటమి సర్కార్ ముందుకు పోతుందనే మాట చెబుతున్నారు లోకేష్. కాపు కులం ఓటర్లను రెచ్చగొట్టేందుకు వైసీపీ కాపు నేతలే తప్పుడు ప్రచారం చేస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. కాపు సామాజిక వర్గాన్ని పవన్‌ నుంచి దూరం చేయడం చేయడం అసాధ్యమని కలెక్టర్ల సమావేశం అనంతరం ఓ మంత్రి వ్యాఖ్యానించిన మాటలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. చంద్రబాబు, పవన్, మోదీ జోడీ విడిపోయే అవకాశం లేదనేది వైసీపీ నేతల మాట కూడా. ఈ బంధం బ్రేక్ చేయాలంటే ఏం చేయాలనే కోణంలో వైసీపీ నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్