Wednesday, February 4, 2026 02:30 PM
Wednesday, February 4, 2026 02:30 PM

రాజకీయం మొదలెట్టిన దళపతి..?

తమిళనాడు రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలున్న నేపథ్యంలో తమిళనాడులో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పార్టీ స్థాపించిన సినీ నటుడు విజయ్ వేయబోతున్న అడుగుల పైనే అందరి చూపు ఉంది. కరూర్ ఘటన తర్వాత విజయ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతూనే బహిరంగ సభలు లేకుండా ఒక్కో అడుగు వేస్తున్నారు. జన సమీకరణ విషయంలో తనపై విమర్శలు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు విజయ్. ఇదే సమయంలో ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు కూడా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఈరోజు (09-12-2025) మీ రాశి ఫలితాలు

ప్రతిపక్ష అన్నా డిఎంకెలో ఉన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఆ పార్టీలో అసంతృప్త నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పార్టీలో ఇప్పటివరకు కీలకంగా వ్యవహరించిన నాయకులు.. మాజీ ముఖ్యమంత్రి పలని స్వామి నాయకత్వాన్ని ఇష్టపడటం లేదు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం నాయకత్వంలో పనిచేసిన కొందరు నాయకులు కూడా ఇప్పుడు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో.. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో చేరేందుకు రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారు.

Also Read : తెలుగు నటి అరుదైన రికార్డు.. ప్రగతి విజయగాథ!

అటు విజయ్ కూడా అసంతృప్తిగా ఉన్న నేతలతో ఫోన్లో మాట్లాడి.. అవసరమైతే వారితో భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో డీఎంకే లో ఉన్న నేతలపై కూడా విజయ్ దృష్టి పెట్టారు. రాబోయే రెండు మూడు నెలల్లో చేరికలు వేగవంతం చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు విజయ్. ఆయా పార్టీలు అసంతృప్త నేతలుగా ఉన్న వారి డిమాండ్లు తెలుసుకొని.. తన పార్టీల వారికి అవకాశాలు కల్పించేదిశగా అడుగులు వేస్తున్నారు. సాధారణంగా కొత్త రాజకీయ పార్టీలకు సీనియర్ నాయకులు అనుభవం ఎంతో కీలకంగా ఉంటుంది. దీనితోనే విజయ్ ఇతర పార్టీల నాయకులపై గురిపెట్టినట్లు సమాచారం. కరూర్ ఘటన తర్వాత విజయ్ పై రాజకీయంగా ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలో సీనియర్ నేతలు సహకారం లేకపోవడంతో విజయ్ వకింత ఒత్తిడికి గురయ్యారు. దీనితోనే ఇప్పుడు సీనియర్ నేతలు పై గురిపెట్టినట్లు తమిళ రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్