Wednesday, May 6, 2026 11:22 PM
Wednesday, May 6, 2026 11:22 PM

తెలుగు నటి అరుదైన రికార్డు.. ప్రగతి విజయగాథ!

సాధారణంగా సినిమా వాళ్లు అంటే ఒక రకమైన భావన. ఇక మహిళల గురించి అయితే మరీ. చాలా సున్నితం, సుకుమారులు అని. ఏసీ లేకపోతే బయటకు రారు.. కాస్త కష్టపడితే కందిపోతారు, అలిసి పోతారు అని అంతా అనుకుంటారు. అందుకే తమ శరీర సౌష్ఠవం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనేది అందరి మాట. కానీ ఇవేవీ కాదని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ఓ సీనియర్ నటి.

Also Read : నోరు జాగ్రత్త జగన్.. వేమిరెడ్డి స్టాంగ్ వార్నింగ్

పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని ప్రముఖ నటి ప్రగతి రుజువు చేశారు. వెండితెరపైన తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన ప్రత్యేకతను సాధించారు. కామెడీ, సీరియస్, హోమ్లీ క్యారెక్టర్లతో అలరించిన ప్రగతి మహావాది.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప అంటే నేషనల్ అనుకొంటివా.. అనే డైలాగ్‌ ఎంత ఫేమస్ అయ్యిందో.. ప్రగతి అంటే.. అనే మాట కూడా ఇప్పుడు అంతే ఫేమస్.

ముఖానికి రంగులు వేసుకునే వాళ్లు.. వీళ్లకేం చేత అవుతుందని హేళనగా చూసే ప్రతి ఒక్కరి నోళ్లు మూయించారు ప్రగతి. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. సరదాగా మొదలైన ప్రయాణం.. ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించేలా చేసింది. బాడీ ఫిట్‌నెస్ కోసం ముందు జిమ్‌లో జాయిన్ అయ్యారు. అలా మొదలైన ప్రయాణం.. చివరికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరింది. 46 ఏళ్ల వయసులో వెయిట్ లిఫ్టింగ్‌పై దృష్టి పెట్టిన ప్రగతి.. 50 ఏళ్ల వయసులో అతివలకు సాధ్యం కానిది ఏదీ ఉండదని రుజువు చేశారు.

Also Read : క్రోం వాడద్దు.. ఆపిల్ స్ట్రాంగ్ వార్నింగ్

ఆసియా గేమ్స్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన ప్రగతి.. ఒక స్వర్ణంతో పాటు రెండు కాంస్య పతకాలు కూడా గెలిచి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. టర్కీలో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్ తరఫున ప్రగతి పాల్గొన్నారు. 105 కిలోల విభాగంలో స్వర్ణం గెలుచుకుని శభాష్ అనిపించుకున్నారు ప్రగతి. ముందు హైదరాబాద్ డిస్ట్రిక్ ఛాంపియన్‌గా మొదలుపెట్టిన ప్రయాణం. తెలంగాణ ఛాంపియన్… తర్వాత కేరళలో జరిగిన జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణం.. టర్కీలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే స్థాయికి ప్రగతి చేరుకున్నారు. వయసు గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికీ.. AGE IS JUST A NUMBER అని దేశ యువతకు స్ఫూర్తినిస్తున్నారు.

అంతర్జాతీయ పోటీల్లో పతకం సాధించిన తొలి తెలుగు నటిగా అరుదైన నటిగా ప్రగతి మహావాది సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఇది ప్రగతి విజయగాథ! చరిత్రలో నిలిచిపోయిన సక్సెస్! ఆమె జీవితంలో ఇదొక గొప్ప మలుపు! వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్, టాలీవుడ్ నటి ప్రగతికి అభినందనలు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్