Saturday, June 20, 2026 11:46 PM
Saturday, June 20, 2026 11:46 PM

వీడియోలతో దొరికిపోయిన జోగి..?

ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం వ్యవహారం కేసు రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో కీలకంగా ఉన్న జోగి బ్రదర్స్ ను విచారించే క్రమంలో పోలీసులు కొత్త విషయాలను బయటపెడుతున్నారు. అసలు అద్దేపల్లి జనార్దన్ రావుతో తనకే సంబంధం లేదని.. పదేపదే జోగి రమేష్ చెప్తూ వచ్చేవారు. కానీ వాళ్ళిద్దరికీ తాతల కాలం నుంచే సంబంధాలు ఉన్నాయని.. కలిసి పెరిగారని, కల్తీ మద్యం వ్యవహారంలో అద్దేపల్లి జనార్దన్ రావు సోదరులు జోగి బ్రదర్స్ కు ఎప్పటికప్పుడు.. మామూళ్లు కూడా పంపించేవారని గుర్తించారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే విజయవాడ కోర్టుతో పాటుగా తంబళ్లపల్లి కోర్టులో కూడా చార్జీ షీట్ దాఖలు చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు.

Also Read : నిన్న జోగి.. రేపు వల్లభనేని..? మళ్ళీ ముహూర్తం ఖరారు..?

ఇక ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో కీలక విషయాన్ని కూడా గుర్తించారు పోలీసులు. నకిలీ ఇన్వాయిస్ లు, డమ్మీ జీఎస్టీ నెంబర్లు వినియోగించి నకిలీ మద్యాన్ని రవాణా చేసినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్, బెంగళూరు నుంచి ఇబ్రహీంపట్నం, మొలకలచెరువుకు మద్యం రవాణా జరిగినట్లు గుర్తించారు. ఇబ్రహీంపట్నంలోని ఏఎన్నార్ బార్ నిర్వాహకులు మురళీకృష్ణ పేరుతో నకిలీ ఇన్వాయిసులు సృష్టించారని తేల్చారు. నకిలీ మద్యం తయారు చేస్తున్న బాదల్ దాస్ తీసిన వీడియోలు.. ఫోరెన్సిక్ ల్యాబ్ సాయంతో వెలికి తీశారు సిట్ అధికారులు.

Also Read : ఛీ ఇలాంటి వారితో రాజకీయమా..? చంద్రబాబు సంచలనం

జోగి రమేష్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద అధికారులను మ్యానేజ్ చేసినట్లు గుర్తించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కావాల్సిన అన్ని సదుపాయాలను అద్దేపల్లి బ్రదర్స్ కు ఎప్పటికప్పుడు అందించారని కూడా తేల్చారు. అవసరమైతే పెట్టుబడిని కూడా జోగి బ్రదర్స్ సమకూర్చినట్లు తేల్చారు. ఇక ఈ కేసు కు సంబంధించి మరిన్ని విషయాలు బయటకు లాగేందుకు మరి కొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో గోవాలో బార్లు నిర్వహిస్తున్న వారిపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే వారిలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్