Wednesday, August 5, 2026 08:38 AM
Wednesday, August 5, 2026 08:38 AM

క్రోం వాడద్దు.. ఆపిల్ స్ట్రాంగ్ వార్నింగ్

తమ వినియోగదారుల వ్యక్తిగత డేటా భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించే ఆపిల్ సంస్థ ఇటీవలి కాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తమ యాప్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ సెక్యూరిటీ పెంచే చర్యలు చేపట్టింది. గూగుల్ విషయంలో వచ్చే కొన్ని ఆరోపణలపై దృష్టి పెట్టిన ఆపిల్ సంస్థ.. తమ వినియోగదారులు సెర్చ్ చేసే అంశాలు, వాడే యాప్స్ ను ట్రాకింగ్ చేయకుండా ఉండేందుకు అవసరమైతే ప్రభుత్వాలతో కూడా యుద్ధం చేసేందుకు వెనకడుగు వేయడం లేదు.

Also Read : అడ్డంగా దొరికిపోయిన జోగి బ్రదర్స్

ఇటీవల సంచార్ సాథి అనే యాప్ విషయంలో యాపిల్ కు భారత ప్రభుత్వం పలు సూచనలు చేయగా.. యాప్ ను తమ ఫోన్ లలో ఇన్స్టాల్ చేసే అవకాశమే లేదని స్పష్టం చేసింది. గోప్యతను కాపాడుకునేందుకు.. గూగుల్ క్రోం నుంచి సఫారికి మారాలని సూచించింది. ఆపిల్ ప్రకారం.. గూగల్ క్రోం లో ప్రమాదంగా భావిస్తోన్న డిజిటల్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ ద్వారా.. వివిధ ప్రకటనలు, వెబ్ సైట్ లు యూజర్ డేటాను ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది. సఫారి యాప్ కూడా.. గూగుల్ షీట్స్, గూగుల్ స్లయిడ్‌లు, గూగుల్ డాక్స్ వంటి ప్రసిద్ధ గూగుల్ యాప్‌ లతో సమానంగా పని చేస్తుందని తెలిపింది.

Also Read : నోరు జాగ్రత్త జగన్.. వేమిరెడ్డి స్టాంగ్ వార్నింగ్

ఇతర గూగుల్ యాప్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని ఆపిల్ హెచ్చరించింది. అసలు డిజిటల్ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటో ఒకసారి చూస్తే.. డిజిటల్ ఫింగర్ ప్రింటింగ్ అనేది ఒక ప్రత్యేకమైన ప్రొఫైల్‌ ను క్రియేట్ చేసే ఫీచర్. ఇన్‌స్టాల్ చేసిన, ఫాంట్‌లు, ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్‌ వేర్ సమాచారం వంటి పరికరం నుండి సంబంధం లేని వివిధ సమాచారాన్ని సేకరిస్తుంది. మనం సమాచారం ఇంకాగ్నిటో మోడ్ లో బ్రౌజ్ చేసినా.. కుక్కీస్ ను బ్లాక్ చేసినా సరే.. డేటాను సేకరిస్తుంది. ఈ రహస్య ట్రాకింగ్ టెక్నిక్ అనేది ప్రమాదకరంగా ఆపిల్ హెచ్చరించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్