Wednesday, February 4, 2026 04:09 PM
Wednesday, February 4, 2026 04:09 PM

కోటలు దాటుతున్న అన్న మాటలు..!

ఏపీలో వైసీపీ నేతల తీరుపై అయ్యో పాపం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు ప్రధానంగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరును ప్రస్తావిస్తున్నారు. అధికారం కోసం ఒక మాదిరిగా.. అధికారంలో ఉన్నప్పుడు ఒక నియంతలా.. ఓడిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారు వైఎస్ జగన్. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసిన జగన్.. ముద్దులతో.. అవ్వా, తాత అంటూ ఆత్మీయంగా పలకరించారు. అప్పుడు ఖర్చు అంతా ఆయా నియోజకవర్గాల్లో స్థానిక నేతలే పెట్టుకున్నారు. రోజుల తరబడి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర చేసినా కూడా నేతలు మాత్రం ఎలాగోలా ఖర్చు పెట్టారు. అధికారంలోకి వస్తే.. ఎంతో కొంత సంపాదించుకోవచ్చు అనే ఆశతో నాడు వైసీపీ నేతలు భారీగానే ఖర్చు చేశారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత వైసీపీ నేతల ఆశలపై జగన్ నీళ్లు జల్లారు.

Also Read : రూపాయి జీతంతో వందల కోట్లు ప్రజల సొమ్ము వాడేసిన జగనన్న..!

2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలుచుకుంది. అధికారంలోకి వచ్చాం.. ఇక మనదే రాజ్యం అని అనుకున్నారు వైసీపీ నేతలు. కానీ జగన్ వారి ఆశలకు బ్రేక్ కొట్టారు. ఏదైనా నేరుగా తనకే తెలియాలి అన్నట్లుగా రూల్స్ మార్చేశారు. కొత్త మద్యం పాలసీని అమలు చేశారు. దీని వల్ల వైన్ షాపులు పొందే అవకాశం లేకుండా పోయింది. పైగా జే బ్రాండ్ అమ్మకాలు, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో యూపీఐ పేమెంట్ లేకపోవడంతో వచ్చిన సొమ్ముతో సంబంధం లేకుండా.. డిస్టిలరీ నుంచి బయటకు వచ్చిన బాటిల్‌ను లెక్క వేశారు. దీని ప్రకారం.. అమ్మకం చేసిన సొమ్ము అంతా నేరుగా పార్టీ పెద్దలకే చేరింది. దీంతో మద్యం ఆదాయం తమకు చేరలేదని వైసీపీ నేతలే లబోదిబో మన్నారు. ఇక మైనింగ్ ఆదాయం కూడా నేరుగా ప్యాలెస్ పెద్దలకే చేరిందనేది వైసీపీ నేతల మాట. అధికారంలో ఉన్న ఐదేళ్లు కనీసం జగన్ అపాయింట్‌మెంట్ కూడా దొరకలేదని మంత్రులే వాపోయారు. ఇక సరిగ్గా ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సగానికి సగం మందిని ఉన్నపళ్లంగా నియోజకవర్గం మార్చేశారు జగన్. దీంతో ఎన్నికల్లో భారీగానే ఖర్చు చేశారు.

2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. అధికారంలో ఉన్న ఐదేళ్లు అధినేత సహా పార్టీ పెద్దల ఆదేశాలను తూచా తప్పకుండా పాటించిన పార్టీ నేతలు.. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌ను బూతులతో రెచ్చిపోయారు. అవి కూడా ఎన్నికల్లో ఓటమికి కారణమే. అయితే ఓడిన తర్వాత కొద్ది రోజుల పాటు తమ నియోజకవర్గాలకు దూరమయ్యారు. కనీసం సొంత జిల్లా వైపు కూడా వచ్చేందుకు ధైర్యం చేయలేదు. అయితే పార్టీ అధినేత వైఎస్ జగన్ మాత్రం వైసీపీ నేతలకు ఎన్నో టాస్కులు ఇస్తున్నారు. క్యాండిల్ ర్యాలీలు, పరామర్శలు, ఓదార్పు ర్యాలీ చేయించారు. ఇక వీటితో పాటు తన పర్యటనల సమయంలో భారీగా జన సమీకరణ ఉండాలని పరోక్షంగా సూచించారు. దీంతో జగన్ పర్యటనల సమయంలో రప్పా రప్పా టీమ్‌ను నేతలు రంగంలోకి దింపారు. వీళ్ల కోసం కూడా ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నారు. ఇదే సమయంలో కొత్త టాస్క్ ఇచ్చారు వైఎస్ జగన్.

Also Read : నెల్లూరు పోలీసుల సెన్సేషన్.. రౌడీల గుండెల్లో రైళ్ళు..!

ఏపీలో మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని.. దీనిని వ్యతిరేకిస్తూ అన్ని నియోజకవర్గాల్లో కోటి సంతకాలు సేకరించాలని ఆదేశించారు. అదే సమయంలో ర్యాలీలు చేయాలన్నారు. వీటి కోసం ప్రత్యేక కార్యచరణ ప్రకటించారు కూడా. అలా సేకరించిన సంతకాలను ఒకరోజు గవర్నర్‌కు అందిస్తామన్నారు. అందుకు ఒక తేదీ కూడా ప్రకటించారు. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా, ర్యాలీ చేయాలని.. నవంబర్ 12న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన.. నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమం చేపట్టాలని.. నవంబర్ 24న జిల్లా కేంద్రాల నుంచి సేకరించిన సంతకాల పత్రాల లారీలతో తాడేపల్లి వైసీపీ కార్యాలయం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. నవంబర్ 24 నుంచి 27 లోపు గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకుని సేకరించిన సంతకాలను గవర్నర్‌కు సమర్పిస్తామన్నారు వైఎస్ జగన్. అయితే ఇక్కడే అసలు డొల్లతనం బయటపడింది.

Also Read : కుహానా మేధావుల కొత్త ఆట : టార్గెట్ చంద్రబాబు..!

నవంబర్ నెల దాటి డిసెంబర్ కూడా వచ్చేసింది. అయినా సరే.. వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికీ సంతకాలు సేకరిస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. ఈ సంతకాల కోసం నానా పాట్లు పడుతున్నారు. నియోజకవర్గానికి 50 వేల సంతకాలు సేకరించాలని తాడేపల్లి పెద్దలు టార్గెట్ పెట్టారు. కానీ చాలా నియోజకవర్గాల్లో అయితే 10 వేలు కూడా పూర్తి కాలేదు. మరోవైపు నియోజకవర్గం సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేసిన పార్టీ పెద్దలు ఈ విషయాన్ని పూర్తిగా మరిచిపోయినట్లున్నారు. అసలు సంతకాల సేకరణ అనేది జరిగిందా అనేలా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ సంతకాల సేకరణ, ధర్నాలు, ర్యాలీలు, రచ్చబండ కోసం కూడా ఖర్చు భారీగానే అయ్యింది. అయినా సరే.. ఇప్పుడు ఆ విషయమే తమకు తెలియదన్నట్లు పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్నారు. సేకరించిన ఆ సంతకాల కాగితాలు ఏం చేయాలో తెలియటం లేదంటున్నారు వైసీపీ నేతలు. తొలి రోజుల్లో సంతకాల సేకరణ ఎంత వరకు వచ్చిందని రోజూ సతాయించిన పార్టీ పెద్దలు.. ఇప్పుడు కనీసం ఆ ఊసే ఎత్తటం లేదని పార్టీ ద్వితీయ స్థాయి నేతలతో పాటు నియోజకవర్గ స్థాయి నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది అయితే మా అన్న మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప.. ఆచరణ లేదంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్