Wednesday, May 6, 2026 11:53 PM
Wednesday, May 6, 2026 11:53 PM

నెల్లూరు పోలీసుల సెన్సేషన్.. రౌడీల గుండెల్లో రైళ్ళు..!

చరిత్రలో రాజకీయ నాయకులకు రౌడీ మూకలకు దగ్గరి సంబంధాలు ఉంటాయి. రాజకీయ నాయకులు చేయాలనుకున్న తప్పుడు వ్యాపారాలను.. రౌడీలను అడ్డం పెట్టుకుని చేస్తూ ఉంటారు. వారి అండ చూసుకుని రౌడీలు సామాన్యులను కూడా వేధిస్తూ ఉంటారు. అక్రమ మద్యం, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు, కబ్జాలు, కూనీలు అన్నీ కూడా రాజకీయ నాయకుల అండతోనే జరుగుతూ ఉంటాయి. 2019 నుంచి 2024 వరకు ఏపీలో ఈ రౌడీ మూకల హడావుడి ఎక్కువగా కనపడింది అనే రాజకీయ విమర్శలు మనం చూసాం.

Also Read : కుహానా మేధావుల కొత్త ఆట : టార్గెట్ చంద్రబాబు..!

ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అడుగులు వేస్తోంది. లేడీ డాన్ ల హడావుడి కూడా గత కొన్నాళ్ళుగా పెరిగింది అనే విమర్శలు ఉన్నాయి. ఏకంగా ప్రభుత్వ శాఖల్లోనే ఈ రౌడీలు దూరిపోయారు అనే విమర్శ.. వచ్చింది. నెల్లూరు లేడీ డాన్ అరుణ వ్యవహారం మొన్నామధ్య సంచలనం అయింది. ఇప్పుడు పెంచలయ్య హత్య వ్యవహారంతో కామాక్షి అనే డాన్, ఆమె అనుచరుల వ్యవహారం ఎక్కువగా సంచలనం అయింది. ఈ నేపధ్యంలో తాజాగా నెల్లూరులో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.

Also Read : కోటంరెడ్డి సంచలనం.. వారి బాధ్యత నా కూతుళ్ళదే..!

నెల్లూరు జిల్లా…రౌడీ షీటర్ లను నెల్లూరు నగర వీధుల్లో ఊరేగించారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెల్లూరు వీఆర్సి సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు రౌడీ షీటర్లను నడిపించారు. దీనితో నెల్లూరు జిల్లా ఎస్పీ అజితపై ప్రసంశలు కురిపిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నెల్లూరులో రౌడీల హడావుడి కాస్త ఎక్కువే. దీనితో వారిని అణచివేసేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పెంచలయ్య హత్య కేసులో నిందితులను పట్టుకునే క్రమంలో కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఆ సందర్భంగా కూడా.. నిందితులను అరెస్ట్ చేయడానికి ఎక్కడి వరకైనా వెళ్తామనే సంకేతాలు కూడా పోలీసులు ఇచ్చినట్లు అయింది. విజయవాడ, గుంటూరు, ప్రకాశం ప్రాంతాల్లో కూడా ఇలాగే వ్యవహరించాలనే డిమాండ్ లు వినపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్