Sunday, June 21, 2026 11:28 AM
Sunday, June 21, 2026 11:28 AM

చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్న సిఎం..!

అన్ని వర్గాలకు సమాన న్యాయం చేసే ప్రయత్నం చేస్తోన్న కూటమి సర్కార్.. తాజాగా కీలక అడుగు వేసింది. దివ్యాంగుల విషయంలో గతంలో జరిగిన తప్పులు జరగకుండా.. వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో వారి సంక్షేమానికి కూడా పెద్ద పీట వేస్తోంది ఏపీ సర్కార్. తాజాగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు ప్రకటించింది. దివ్యాంగులకు సిఎం చంద్రబాబు నాయుడు ఏడు వరాలను ప్రకటించారు.

Also Read : పవన్ పై కవిత సంచలన కామెంట్స్..!

ఇప్పటివరకు మహిళలకు మాత్రమే అందుతున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని దివ్యాంగులకు కూడా వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇది నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి రానుంది. స్థానిక సంస్థల్లో, కార్పొరేషన్స్-పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని సిఎం చంద్రబాబు ప్రకటించారు. ఆర్ధిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అందించినట్టుగానే దివ్యాంగులకు అందిస్తామని తెలిపారు.

Also Read : బాలు విగ్రహం చుట్టూ రాజకీయం..!

స్పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామని తెలిపారు. బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తామని ప్రకటించారు. బాపట్లలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజ్‌తో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్‌లో చదివే దివ్యాంగ విద్యార్ధులకు అదే చోట సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో అమరావతిలో ‘దివ్యాంగ్ భవన్’ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనిపై ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్