Sunday, June 21, 2026 02:00 PM
Sunday, June 21, 2026 02:00 PM

క్లీన్ సిటీ ఇన్ సౌత్ ఇండియా.. బెజవాడ పై కన్నడ భక్తుడి వీడియో

విజయవాడ చూసి ఆశ్చర్యపోయా అంటూ నగర శుభ్రతపై ఓ నెటిజన్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకకు చెందిన ఓ నెటిజన్ రెండు రోజుల క్రితం విజయవాడ సిటీలో తనకు ఎదురైన అనుభవాలతో వీడియో చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో రైలు దిగిన దగ్గర నుంచి.. తిరిగి రైలు ఎక్కే వరకు ఏం జరిగిందో వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : వాళ్లు చెప్పిందే ఫైనల్..!

క్లీనెస్ట్ సిటీ ఇన్ సౌత్ ఇండియా అంటూ వీడియో ప్రారంభించారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఓ ఆటోలో ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ దుర్గమ్మ దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకుని.. తిరిగి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ మొత్తం వీడియో తీసిన కన్నడ భక్తుడు.. విజయవాడ నగరాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయినట్లు కామెంట్ చేశారు. ఇంత పరిశుభ్రంగా ఉన్న నగరం అరుదుగా చూశానన్నారు.

విజయవాడ నగరం చాలా క్లీన్‌గా ఉందని.. ప్రజలు చాలా వినయంగా సహకరించారన్నారు. ఇలాంటి శుభ్రత, సేవ ప్రతి నగరంలో ఉంటే భారతదేశం మరింత అందంగా మారుతుందని వ్యాఖ్యానించాడు. నగరం ఇంత క్లీన్‌గా ఉండటానికి చాలా చిన్న కారణమన్నారు. ప్రతి వంద మీటర్లకు డస్ట్ బిన్ ఏర్పాటు చేశారని.. ఇలా ఏర్పాటు చేస్తే.. ఏ సిటీ అయినా ఇంతే శుభ్రంగా ఉంటుందన్నారు. దుర్గ గుడి సమీపం నుంచి కృష్ణా నది తీరాన్ని చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : కేంద్రానికి షాక్ ఇచ్చిన యాపిల్..!

నగరాభివృద్ధిలో ప్రజల సహకారమే కీలకమని ఈ వీడియో మరోసారి గుర్తుచేస్తోంది. ఈ వీడియోను మంత్రి నారా లోకేష్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ట్యాగ్ చేశారు. విజయవాడ సిటీనే కాదు.. ఏపీ అంతా ఇలాగే పరిశుభ్రంగా ఉంటుందని కామెంట్ చేశారు. ఇందుకు ఏపీ ప్రజల సహకారం మర్చిపోలేమన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్