Sunday, June 21, 2026 05:01 AM
Sunday, June 21, 2026 05:01 AM

వాళ్లు చెప్పిందే ఫైనల్..!

సినీ పరిశ్రమను ఎవరు శాసిస్తున్నారు అంటే.. హీరోలని కొందరంటే.. కాదు దర్శకులంటారు మరికొందరు.. అబ్బే వీళ్లేవరు కాదు.. బడా నిర్మాణ సంస్థలంటారు.. అసలు వీళ్లు కూడా థియేటర్లు తమ చేతుల్లో పెట్టుకుని నిర్మాతలను బెదిరించే ఎగ్జిబీటర్లు అంటారు ఇంకొందరు. అయితే సినిమా హిట్ అయినా, కాకున్నా.. నిర్మాతకు కాసిని డబ్బులు వెనక్కి వచ్చేది మాత్రం ఓటీటీ సంస్థల వల్లే అనేది బహిరంగ రహస్యం. తమ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించడం కంటే ముందే ఓటీటీ సంస్థలు ఆ సినిమాను చూస్తాయి. వాళ్లు ఆ సినిమాకు ఒక ధర నిర్ణయిస్తారు. పెద్ద హీరోలు, దర్శకుల సినిమాలకు అయితే షూటింగ్ దశలో ఉన్నప్పుడే వచ్చి బేరం ఆడేసుకుని.. సినిమాను సొంతం చేసుకుంటాయి కూడా.

Also Read : ఫిబ్రవరిలోనే ఎంగేజ్మెంట్..? అప్పుడే హింట్ ఇచ్చిన సమంతా..?

ప్రస్తుతం ఏ సినిమా అయినా సరే.. థియేటర్లలో వచ్చిన తర్వాత నెల రోజుల్లో లేదా ఆ సినిమా నిర్మాతతో చేసుకున్న ఒప్పందం మేరకు ఓటీటీలో విడుదలవుతోంది. దీంతో చాలా మంది సినీ ప్రేమికులు.. థియేటర్లలో టికెట్ ధరలకు భయపడి ఓటీటీలో వచ్చే వరకు ఎదురు చూస్తున్నారు. అందుకే కొన్ని సినిమాలు థియేటర్లలో కలెక్షన్ రాకపోయినా సరే.. ఓటీటీలో మాత్రం దుమ్ము రేపుతున్నాయి. కాంతార, ఓజీ వంటి సినిమాలు థియేటర్ల నుంచి తీసేసినా కూడా.. ఇప్పటికీ ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. అందుకే నిర్మాతలకు ఎక్కువ ధర చెల్లించేందుకు ఓటీటీలు ఆసక్తి చూపిస్తున్నాయి కూడా.

Also Read : పుతిన్ ఫస్ట్ ట్రంప్ నెక్స్ట్.. రష్యాతో భారత్ కీలక ఒప్పందం..?

అయితే తాజాగా ఓ విషయం టాలీవుడ్‌లో వైరల్‌గా మారింది. ఇంకా చెప్పాలంటే చిన్న నిర్మాతలను కలవరపెడుతోంది కూడా. ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు చాలా ఉన్నాయని.. కాబట్టి కొత్తవి తీసుకునే పరిస్థితి లేదని చెబుతోందట. మరో సంస్థ అయితే.. కొనుగోళ్లను బాగా తగ్గించింది. అది ఏ స్థాయి వరకు అంటే.. నవంబర్‌ నెలలో 5 సినిమాలు కూడా తీసుకోలేదు. ఇక ఓ నిర్మాత ఆధ్వర్యంలో నడుస్తున్న మరో పెద్ద సంస్థ అయితే గీసి గీసి బేరం ఆడుతోంది. తక్కువకు అనే కంటే.. చాలా తక్కువకు అడుగుతోంది. మరో పెద్ద సంస్థ చెబుతున్న మాటలకు నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారు. సినిమా ఏదైనా సరే.. తమ దగ్గర ఉన్న ఫండ్స్‌కు దొరికితేనే కొంటాం అంటోంది. దీంతో నిర్మాతలు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. డిజిటల్ రైట్స్ ద్వారా నాలుగు డబ్బులు వస్తాయని ఆశపడిన నిర్మాతలు.. ఓటీటీ సంస్థల చెప్పిందే ఫైనల్ అని తెలియటంతో లబోదిబో అంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్