Saturday, September 19, 2026 11:19 PM
Saturday, September 19, 2026 11:19 PM

ఆ జిల్లా సంగతి నేను చూస్తా.. చంద్రబాబు కీలక కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు, నూతన రెవెన్యూ డివిజన్ లు, మండలాలు వంటి అంశాలపై గత కొన్నాళ్ళుగా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రాల విషయంలో ప్రజల్లో అభ్యంతరాలు ఉన్న నేపధ్యంలో మార్పులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ విషయంలో తాజాగా సిఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది ప్రభుత్వం.

Also Read : మా ఓటమికి ఆమే కారణం..!

కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలకు నెల రోజుల గడువు ఇచ్చింది సర్కార్. నివేదికకు ఆన్‌ లైన్‌ లో మంత్రులు ఆమోదం తెలపనున్నారు. ఆమోదం తర్వాత గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. కొత్తగా మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాల ఏర్పాటు చేస్తూ నిర్ణయించారు. దీనితో ఏపీలో 26 నుంచి 29కి జిల్లాల సంఖ్య పెరగనుంది. ప్రకాశం జిల్లాలో అద్దంకి, కందుకూరు విలీనం కానున్నాయి. ఇక తూర్పు గోదావరిలోకి మండపేట నియోజకవర్గం వెళ్లనుంది. వాసవి పెనుగొండ మండలంగా పెనుగొండ మారనుంది.

Also Read : బ్రేకింగ్: గోదావరి పుష్కరాల తేదీలు ఇవే.. చంద్రబాబు ఖాతాలో హ్యాట్రిక్ రికార్డ్..!

ఇక కొత్త మండలంగా ఆదోని మండలంలోని పెద్దహరివనం ఆవిర్భవిస్తుంది. ఇదిలా ఉంచితే ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ ప్రస్తుతం లేనట్లేనని తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యవహారం తాను చూసుకుంటానని కేబినెట్‌ సబ్‌ కమిటీ ముందు సిఎం స్పష్టం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనితో యథాతధంగానే గన్నవరం, పెనమలూరు, నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలు కొనసాగుతాయి. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇటీవల కేబినేట్ సబ్ కమిటీ ముందు తమ విజ్ఞప్తులు ఉంచిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్