Wednesday, February 4, 2026 12:21 PM
Wednesday, February 4, 2026 12:21 PM

ఐ బొమ్మతో పైరసీ నిజంగానే ఆగుతుందా..?

Prevention is better than cure.. చికిత్స కంటే నివారణ మంచిది అందరు చెప్పే మాట. ఇక ఛత్రపతి సినిమాలో మంత్రి కోటా శ్రీనివాసరావుతో హీరో ప్రభాస్ ఓ డైలాగ్ చెబుతారు. వాడు పోతే వీడు.. వీడు పోతే వీడమ్మ మొగుడు అంటూ ఇంకెవరైనా వస్తే.. అనే భారీ డైలాగ్ బాగా ఫేమస్. ఇప్పుడు ఇదే డైలాగ్‌ ఓ విషయంలో బాగా వినిపిస్తోంది. ఐ బొమ్మ రవి అరెస్టు తర్వాత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే హాట్ టాపిక్. పైరసీ ఆగిపోతుందా.. అనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది.

Also Read : మావోయిస్టుల అరెస్టుపై పోలీసుల సంచలన ప్రకటన.. అందుకే బెజవాడ వచ్చారా..?

ఐ బొమ్మతో పైరసీ ఆగుతుందా.. అంటే.. అది అసాధ్యం అనే మాట బాగా వినిపిస్తోంది. నిజానికి పైరసీ అనేది ఐ బొమ్మతో మొదలవ్వలేదు.. ఐ బొమ్మతో ఆగిపోదు.. కొత్తగా వీడియో కెమెరాలు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచే పైరసీ మొదలైంది. తొలి రోజుల్లో థియేటర్లలో వీడియో కెమెరాలు పెట్టి సినిమా మొత్తం రికార్డు చేసి.. దానిని వీహెచ్ఎస్ క్యాసెట్ల ద్వారా షాపుల్లో అద్దెకి ఇచ్చారు. తర్వాత సీడీలు.. ఇప్పుడు ఆన్ లైన్‌ వెబ్ సైట్లు. తొలి రోజుల్లో వీడియో షూటింగ్ చేస్తే.. ఇప్పుడు మాత్రం ఏకంగా నెట్ వర్క్ హ్యాక్ చేసి ఆన్ లైన్ ద్వారా ప్రింట్ అందుబాటులోకి తెస్తున్నారు. ఏదైనా సరై పైరసీ మాత్రం ఆగలేదు.

ఇక ఐ బొమ్మ రవి అరెస్టు తర్వాత భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సినీ రంగానికి చెందిన వాళ్లేమో రవిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక నిర్మాత కళ్యాణ్ అయితే ఎన్‌కౌంటర్ చేయాలంటున్నారు. నటుడు శివాజీ అయితే.. రవి బ్రెయిన్ మామూలుగా లేదని.. దేశానికి మంచి జరిగేలా వినియోగించాలన్నారు. అటు సినీ ప్రేమికులు మాత్రం.. థియేటర్లలో భారీ రేట్లు భరించలేకే ఐ బొమ్మ వెబ్ సైట్‌లో చూస్తున్నామంటున్నారు. దీంతో రవి అరెస్టుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

Also Read : ఆ ఒక్కడు కూడా ఎన్కౌంటర్..? మావోయిస్ట్ చరిత్ర ముగిసినట్టే..?

ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. “హ్యాకర్లు, హ్యాకింగ్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి. ఒకడు పోతే మరోడు వస్తాడు, అది కూడా ఇంకా అధునాతనంగా. కొందరిని అరెస్టు చేశామన్న కారణంతో పైరసీ లేదా సైబర్ క్రైమ్స్ పూర్తిగా ఆగిపోతాయని అనుకోవడం ఉటోపియన్ (అసాధ్యమైన ఆశ). పెద్ద, సాంకేతిక నైపుణ్యం ఉన్న దొంగల గ్యాంగ్స్‌ను పట్టుకున్న తర్వాత దొంగతనాలు, చోరీలు, దాడులు, మోసాలు అన్నీ ఆగిపోయాయా!!?? మానవుడు ఉన్నంత కాలం, ఈ రకాల నేరాలు కూడా ఉంటూనే ఉంటాయి. మన చేతిలో ఉన్నది ఒక్కటే — నివారణ (Prevention). తక్షణంగా డబ్బు సంపాదించాలనే లోభాన్ని తగ్గించుకోవాలి, ఎందుకంటే అదే సైబర్ క్రైమ్ పెరగడానికి మూల కారణం. తమ సైబర్ స్పేస్, ఖాతాలను రక్షించుకోవడానికి చర్యలు తీసుకోవాలి, ప్రమాదాన్ని వెంటనే గుర్తించగలగాలి. “జీవితంలో ఏది కూడా ఫ్రీగా రాదూ” అని రాజమౌళి గారు చెప్పిన మాటే జీవితం యొక్క అసలు నిజం!” అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిపై ఇప్పటికే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్